పెదవులు గులాబీ రంగు

29 Jul, 2016 23:57 IST|Sakshi
పెదవులు గులాబీ రంగు

బ్యూటిప్స్
 
పెదవులు పగిలి బాధ పెడుతుంటే... నేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే వారం తిరిగేసరికల్లా సమస్య తగ్గిపోతుంది.

స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.

మరిన్ని వార్తలు