చేదైనా సరే తినండి... చేటు తప్పించుకోండి

27 Feb, 2020 10:05 IST|Sakshi

కాకర

చాలామంది కాకరకాయను చూడగానే ముఖం చిట్లిస్తారు. చేదంటూ దాని జోలికే వెళ్లరు. కానీ కాయ చేదైనా దాంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే వారంలో ఒకసారైనా కాకరకాయను ఏదో ఒక వంటకంగా చేసుకుని తినండి. వంట ప్రక్రియలో చేదును విరిచేసే ప్రక్రియలూ ఉంటాయి. వాటిని అనుసరించి కాకరకాయను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం కలిగే ప్రయోజనాలివే...

కాకరకాయలో క్యాలరీలు చాలా తక్కువ అందుకే స్థూలకాయం, ఊబకాయం రాకుండా నివారిస్తుంది. క్యాలరీలు తక్కువగా పోషకాలు మాత్రం చాలా ఎక్కువ.  
ఇందులో విటమిన్‌ బి1, బి2, బి3, సి...లతో పాటు జీర్ణక్రియకు దోహదం చేసే పీచు ఎక్కువగా ఉంటుంది.
మెగ్నీషియ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలూ ఎక్కువ.
కాకరలోని విటమిన్‌–సి దేహంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. మన దేహంలో పుట్టే ఫ్రీరాడికిల్స్‌ మ్యాలిగ్నంట్‌ కణాల (క్యాన్సర్‌ కారక కణాలు) ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఇలా కాకర సాధారణ క్యాన్సర్లనే కాకుండా, లుకేమియా లాంటి బ్లడ్‌క్యాన్సర్లనూ నివారిస్తుంది.
కాకర కాయ కడుపులో చేరిన పరాన్నజీవులను హరిస్తుంది. కడుపులో నిల్వ చేరిన విషపూరితమయ్యే వ్యర్థాలను తొలగిస్తుంది.
కాకర మలేరియా బ్యాక్టీరియానూ తుదముట్టించగలదు. చికెన్‌పాక్స్, మీజిల్స్, హెర్ప్స్, హెచ్‌ఐవి కారక వైరస్‌లను శక్తిహీనం చేస్తుంది.
కాకర గింజలు గుండె పనితీరును క్రమబద్ధం చేస్తాయి. ఇవి రక్తనాళాల్లోని కొవ్వును కరిగించి గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి.
డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు కాకర మంచి స్వాభావికమైన ఔషధంగా అనుకోవచ్చు. ఇది ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ నిల్వలను తగ్గిస్తుందన్న విషయం చాలామందికి తెలిసిందే.  
బ్లడ్‌ప్రెషర్‌లో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది.
కాలేయంపై పడే అదనపు భారాన్ని కూడా కాకర నివారిస్తుంది.

మరిన్ని వార్తలు