షాండ్లియర్‌తో మహిళ నిశ్చితార్ధం

26 Nov, 2018 15:37 IST|Sakshi

లండన్‌ : ప్రేమకు వయసు, మతమే కాదు ఏవీ అడ్డురావని 34 ఏళ్ల బ్రిటన్‌ మహిళ మరోసారి చాటిచెప్పారు. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌కు చెందిన అమాండ లిబర్టీ 91 సంవత్సరాల షాండ్లియర్‌తో నిశ్చితార్ధం జరుపుకుని ఏకంగా దానికి లుమియర్‌ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఈబే నుంచి కొనుగోలు చేసిన ఈ జర్మన్‌ షాండ్లియర్‌ టాటూను ఆమె తన ఎడమ చేతిపై వేసుకున్నారు.

ప్రముఖ బ్రిటిష్‌ టీవీ షో టాటూ ఫిక్సర్స్‌ స్టార్‌ అలిస్‌ పెర్రిన్‌ ఈ టాటూను వేశారు. షాండ్లియర్‌తో తన జీవితం పంచుకునేందుకు ఆమె త్వరలోనే కమిట్‌మెంట్‌ సెర్మనీని కూడా నిర్వహించబోతున్నారు. వస్తువుల పట్ల ఆకర్షితమయ్యే డిజార్డర్‌తో అమండా బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇది ఓ రకమైన మానసిక దౌర్భల్యమని వారంటున్నారు.

మరిన్ని వార్తలు