చిన్నారులే నడుపుతున్న న్యూస్‌ చానెల్‌! వాళ్లే రిపోర్టింగ్‌, యాంకరింగ్‌..

12 Nov, 2023 14:09 IST|Sakshi

బాలల కోసం బాలలే నడిపిస్తున్న చానల్‌ ఇది. బ్రిటన్‌కు చెందిన ‘స్కై చానల్‌’లో భాగంగా ‘ఎఫ్‌వైఐ’– ఫ్రెష్‌ యూత్‌ ఇనీషియేటివ్‌ వారానికి ఒకరోజు ప్రతి శుక్రవారం బాలల కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇందులో రిపోర్టింగ్, యాంకరింగ్‌ వంటి పనులన్నీ బాలలే చేస్తారు. వీరు ఆరితేరిన రిపోర్టర్లు, యాంకర్లకు దీటుగా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుండటం విశేషం.

ఈ బాల జర్నలిస్టులు బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ సహా ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. వారం రోజుల్లో జరిగిన ముఖ్య పరిణామాలపై ‘వీక్లీ న్యూస్‌ షో’, పిల్లలతో మాటామంతి కార్యక్రమం ‘కిడ్వర్జేషన్‌’, ‘బిగ్‌ ఏంబిషన్‌’, ‘మ్యాన్‌ వర్సెస్‌ చైల్డ్‌’ కార్యక్రమంలో బాలల వంటల విశేషాలు వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉక్రెయిన్, గాజా ప్రాంతాల్లో యుద్ధాల వల్ల బాధితులైన బాలల గురించి కూడా ఈ బాల జర్నలిస్టులు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశారు.  

(చదవండి: హైటెక్‌ డాన్స్‌మ్యాట్‌! ఈజీగా నేర్చుకోవచ్చు!)

మరిన్ని వార్తలు