డిసెంబర్ 14 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

14 Dec, 2015 00:53 IST|Sakshi
డిసెంబర్ 14 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

రానా (నటుడు), సమీరా రెడ్డి (నటి)
 
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతు సంఖ్య కాబట్టి వీరు ఈ యేడు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. మంచి సలహాదారుగా పేరు గడిస్తారు. ఇంటాబయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికతతో సంసార జీవితం నుంచి దూరంగా వెళ్లడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. అందువల్ల జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడపడం మంచిది. పుట్టిన తేదీ 14. ఇది బుధసంఖ్య కావడం వలన చేసే పనిలో నైపుణ్యం చూపిస్తారు. విదేశీయానం చేస్తారు. రాజకీయ నాయకులకు గౌరవమర్యాదలు, పదవులు లభిస్తాయి. గ్రీన్‌కార్డ్ లేదా స్థిరనివాసం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మేనేజ్‌మెంట్ రంగంలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లకు, ఫైనాన్స్ రంగ ంలోని వారికి కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగా పుంజుకుంటారు.

 లక్కీ నంబర్లు: 1, 4,5,6,8; లక్కీ కలర్స్: పర్పుల్, బ్లూ, వయోలెట్, గ్రీన్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని, ఆది, సోమ వారాలు. సూచనలు: గణపతి ఆరాధన, మతగురువులను గౌరవించడం,వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం.
 -డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా