రారండోయ్‌

28 May, 2018 00:45 IST|Sakshi
  • ‘‘వందేళ్ల ఓయూ: జ్ఞాపకాలు – అనుభవాలు’’ పుస్తకావిష్కరణ సభ, ‘‘ఓయూ’ను కాపాడుకుందాం! ప్రైవేట్‌ యూనివర్సిటీలను వ్యతిరేకిద్దాం’’ సదస్సు మే 28న ఉదయం 10:30కు ఐ.సి.ఎస్‌.ఎస్‌.ఆర్‌. సెమినార్‌ హాల్, మెయిన్‌ లైబ్రరీ, ఓయూలో జరగనుంది. సంపాదకుడు: డేవిడ్‌. నిర్వహణ: తెలంగాణ ఆత్మగౌరవ వేదిక, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్స్‌.
  • ‘ఎన్నీల ముచ్చట్లు’ ఐదేండ్ల పండుగ మే 29న సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌ ప్రగతి నగర్‌లోని నలిమెల భాస్కర్‌ మిద్దె మీద జరగనుంది. నిర్వహణ: సాహితీ సోపతి, తెలంగాణ రచయితల వేదిక–కరీంనగర్‌ శాఖ.
  • అకాల మరణం చెందిన కవి, నటుడు, దర్శకుడు వడ్నాల కిషన్‌ పేరున ‘చైతన్య కళాభారతి’ ఇస్తున్న ఐదు పురస్కారాలకు రొడ్డ యాదగిరి(రంగస్థలం), అన్నవరం దేవేందర్‌ (సాహిత్యం), చొప్పరి జయశ్రీ (నృత్యం), తిరునగరి మోహనస్వామి (సంగీతం), రాదండి సదయ్య (లఘుచిత్రం) ఎంపికయ్యారు. ప్రదానం మే 30న కరీంనగర్‌ కళాభారతిలో.
  • గుంటూరు శేషేంద్ర శర్మ 11వ వర్ధంతి సభ మే 30న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో జరగనుంది. నిర్వహణ: జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్, శ్రీ త్యాగరాయ గానసభ.
  • చిత్తలూరి సత్యనారాయణ కవితాసంపుటి ‘నల్ల చామంతి’ ఆవిష్కరణ సభ మే 31న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్‌.
  • పల్లా జాతీయ పురస్కారం –2018కి కొమ్మవరపు విల్సన్‌రావు కవితా సంపుటి ‘దేవుడు తప్పిపోయాడు’ ఎంపికైంది. జూన్‌ 6న కడప జిల్లా ప్రొద్దుటూరులోని చౌడీశ్వరీ కల్యాణ మండపంలో ప్రదానం జరగనుంది. నిర్వహణ: యువసాహితి, ప్రొద్దుటూరు.

మరిన్ని వార్తలు