జడ్జిగారి సమస్య

17 Apr, 2020 07:46 IST|Sakshi

లాక్‌డౌన్‌ అయినా సరే కోర్టులు పని చేయాలి. లేకపోతే ముఖ్యమైన కేసులు ఆగిపోతాయి. అందుకే ఇప్పుడు అన్నీ దేశాల కోర్టులూ ఆన్‌లైన్‌లో వాదోపవాదాలు విని తీర్పులు ఇస్తున్నాయి. ఫ్లోరిడాలో మార్చి 16 నుంచి కోర్టులు పని చేయడం లేదు. లాయర్లు, జడ్జిగారు వీడియో కాన్ఫరెన్సులోకి వచ్చి కేసుల పరిష్కారం చేస్తున్నారు. అయితే ఫ్లోరిడా జడ్జి డెన్నిస్‌ బెయిలీకి తనకై తను పరిష్కరించుకోవలసిన సమస్యొకటి వచ్చి పడింది. లాయర్‌లు బెడ్‌ మీద నుంచి లేవకుండానే ఆన్‌లైన్‌లో స్క్రీన్‌ మీద సాక్షాత్కరిస్తున్నారు.

కొందరికి ఒంటిమీద తగినన్ని బట్టలు ఉండటం లేదు. ఇంకొందరు కళ్లు నులుముకుని ఆవులిస్తూ, ‘‘యువర్‌ ఆనర్‌’’ అంటున్నారు. ‘‘ఆర్గ్యుమెంట్సే వినాలా, మీ అవతారాలను చూడాలా’’ అని అప్పటికీ జడ్జిగారు అన్నారు. ఆ మాటను సరిగా అర్థం చేసుకోలేదో.. స్క్రీన్‌ మీద కనిపించేదానికి కోటూ, టై ఎందుకు అని అనుకున్నారో.. ఎవరూ స్పందించలేదు. చివరికి విసిగిపోయిన జడ్జి డెన్నిస్‌.. ఆర్డర్‌ పాస్‌ చేసి అందరికీ మెయిల్‌ పెట్టారు... కోర్టుకు వచ్చినట్లే వీడియో కాన్ఫరెన్స్‌కీ రావాలని.

మరిన్ని వార్తలు