అమ్మాయిలు  వాలిపోతున్నారు

2 Feb, 2018 00:09 IST|Sakshi
వీడే ఆ హీరో  లీ జేయాన్‌.  గేమ్‌ ఆడుతున్న చైనా యువతి 

  షి ఎకానమీ

లీ జేయాన్‌ వయసు 28 ఏళ్లు. బిజినెస్‌ టైకూన్‌. పైగా అందగాడు. చైనా అమ్మాయిలంతా ఇప్పుడు అతడంటే పడి చస్తున్నారు! కాలేజీ అమ్మాయిలకయితే.. ‘ఐయామ్‌ మిసెస్‌ లీ జేయాన్‌’ అని చెప్పుకోవడం ఫ్యాషన్‌ అయిపోయింది. లీ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ని కూడా పక్కన పడేస్తున్నారు! మగాళ్లకు శత్రువులా దాపురించిన ఈ లీ ఇంతకీ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ‘లవ్‌ అండ్‌ ప్రొడ్యూజర్‌’ అనే వీడియో గేమ్‌ నుంచి! అందులోని నమిక్‌ క్యారెక్టరే లీ జేయాన్‌. డిసెంబర్‌లో ఈ గేమ్‌ మొబైల్స్‌లోకి వచ్చింది. ఇప్పటి వరకు కోటి మందికి పైగా అమ్మాయిలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మొబైల్‌లో వీడియో గేమ్స్‌ ఆడుతున్న ప్రతి నలుగురిలో ఒక అమ్మాయి లీతో గేమ్స్‌ ఆడుతోంది! చైనాలో ఇప్పుడున్నది ‘షి ఎకానమీ’. ఆర్థిక వ్యవస్థ అంతా అమ్మాయిల చుట్టూతానే రౌండ్స్‌ కొడుతోంది.

వాళ్లను బుట్టలో వేసుకోడానికి కంపెనీలు రకరకాల ఆసనాలు వేస్తున్నాయి. అందులో భాగంగానే ‘లవ్‌ అండ్‌ ప్రొడ్యూజర్‌’ అనే ఈ గేమ్‌ తయారైంది. ఇందులో మన లీ గారితో పాటు, ఒక సైంటిస్టు, ఒక స్పెషల్‌ ఏజెంటు, ఒక ప్రఖ్యాత గాయకుడు ఉంటారు. ఈ నలుగురిలో ఒక ఆప్షన్‌ తీసుకుని ముందుకు వెళ్లాలి. గేమ్‌ స్టార్‌ అయ్యీ కాగానే చైనా అమ్మాయిలంతా ‘లీ’తో చెట్టపట్టాలు వేసుకుని స్మార్ట్‌ఫోన్లో గంటల కొద్దీ తల దూర్చేస్తున్నారు. ఒకటే ఇకఇకలు పకపకలు! లీ అస్సలు అమ్మాయిల మనసు నొప్పించడట. అదీ పాయింట్‌! అబ్బాయ్‌లూ విన్నారా.. ఈ టిప్‌ ఏమైనా వర్కవుట్‌ అవుతుందేమో నోట్‌ చేసుకోండి.. వెంటనే. 

మరిన్ని వార్తలు