అనుకోని అతిథి

19 Nov, 2023 03:24 IST|Sakshi

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. మాధవన్, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలోప్రారంభమైంది. ఈ సినిమా సెట్స్‌ని అతిథిలా సందర్శించారు రజనీకాంత్‌. ఆ ఫోటోను కంగనా రనౌత్‌ షేర్‌ చేశారు.

‘‘మా సినిమా తొలి రోజే గాడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా తలైవర్‌ (రజనీకాంత్‌ను ఉద్దేశించి..) మా సినిమా సెట్స్‌కు వచ్చి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మేం థ్రిల్‌ అయ్యాం. మాధవన్‌ త్వరలోనే సెట్స్‌లో జాయిన్‌ అవుతారు’’ అని పేర్కొన్నారు కంగనా. ఈ సందర్భాన్ని ఉద్దేశిస్తూ..‘‘అద్భుతమైనప్రారంభం’’ అని మాధవన్‌ ట్వీట్‌ చేశారు. ఇక హిందీ చిత్రం ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ (2015) తర్వాత మాధవన్, కంగనా రనౌత్‌ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.  

మరిన్ని వార్తలు