జీలకర్రతో 15 రోజుల్లో పొట్ట తగ్గుతుందట!

23 Mar, 2018 18:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  చంకలో పిల్లాడిన్ని పెట్టకుని ఊరంతా వెతికారట!! అనే సామెత తెలిసే ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆరోగ్య నియమాలు పాటించకుండా దాదాపు అందరూ పొట్టలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నవారే..!!  అధిక బరువుతో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నవారే..!! కానీ ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం మనం రోజూ వాడే జీలకర్రలోనే ఉందట. అందుకే చంకలో పిల్లాడు... అనే సామెత చెప్పింది.  అవును ఇది నిజం.  జీలకర్ర ద్రావణం గొప్ప ఆరోగ్య ఔషదమని  పరిశోధనల్లో తేలింది. 

రోజూ ఉదయం...
జీలకర్ర నీటితో కేవలం 15 రోజుల్లో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. రోజూ పరగడుపున ఈ నీటిని తీసుకుంటే చెడు కొవ్వుని తగ్గించుకోవడంతోపాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఒక ఓ రీసెర్చ్‌ వెల్లడించింది. జీరా వాటర్‌ మలబద్దకాన్ని దూరం చేసి,  జీర్ణక్రియను మెరుగు పరుస్తుందనీ.. జీవ క్రియ రేటుని పెంచుతుందని తెలిపింది.

తయారీ విధానం...
ఒక గ్లాసు మంచి నీటిలో టేబుల్‌ స్పూన్‌ జీలకర్రను రాత్రి మొత్తం నానబెడితే చాలు.  నీరంతా జీరా గింజల్లోకి చేరడంతో వాటిలో ఉండే పోషకాలు నీటిలోకి చేరతాయి.  అంతే జీరా వాటర్‌ రెడీ.  పసుపు రంగులోకి మారిన ఆ ద్రావణంలో కేవలం 7 కాలరీలు మాత్రమే ఉండడం విశేషం. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి సాఫ్ట్‌ డ్రింక్‌గా పనిచేస్తుందనేది పరిశోధనల సారాంశం.

చెడు కొవ్వు మైనస్‌, మంచి కొవ్వు ప్లస్‌
సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడంతో జీవక్రియ మందగిస్తుంది. శరీరంలోని చక్కెరలు, కొవ్వులు ఖర్చు కావు. దాంతో  శరీరంలో అధికంగా కొవ్వు పేరకుపోయే ప్రమాదం ఉంది.  జీరా ద్రావణాన్ని రోజూ తీసుకోవడం వల్ల అందులో విరివిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ఆక్సిజన్‌ రాడికల్స్‌ను తొలగిస్తాయని తెలిసింది.  తద్వారా జీవక్రియ మెరుగు పడి బరువు తగ్గడం తేలికవుతుందని రీసెర్జి అధికారులు అంటున్నారు.  ఇది ఒంట్లోని చెడు కొవ్వుని తొలగించడంతో గుండె జబ్బుల బారిన అవకాశాన్ని తగ్గిస్తుంది.  ఇంకా శరీరానికి అవసరమైన మంచి కొవ్వుని వృద్ధి చేస్తుంది.

హ్యాపీగా తినొచ్చు..
మంచి జీర్ణక్రియతో మంచి ఆరోగ్యం సాధ్యం.  జీరా వాటర్‌ ప్రేగుల్లో కదలికలను మెరుగు పరచి, అక్కడ ఉండే ఎంజైమ్‌లపై ప్రేరకంగా పనిచేస్తుంది. తద్వారా పొట్టలో ఉబ్బరాన్ని తగ్గించి, మంచి జీర్ణక్రియ సొంతమవుతుందని పరిశోధకులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు