సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్‌ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు

15 Nov, 2023 15:55 IST|Sakshi

కేలరీలు బర్న్‌ అవ్వాలని రకరకాల వ్యాయామాలు, ఏవేవో ఫీట్‌లు చేస్తుంటా. అంతా చేసిన కాస్తో కూస్తో బరువు తగ్గుతాం. కానీ ఆ సినిమాలు చూస్తే వందల కొద్ది కేలరీలు ఖర్చు అవ్వడమే గాక ఆకలి తగ్గి తెలియకుండానే మితంగా తింటమట​. బరువు కూడా ఈజీగా తగ్గుతామని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అదెలా సాధ్యం పైగా కూర్చొని సినిమా చూస్తే కేలరీలు తగ్గిపోతాయా..? అనిపిస్తుంది కదా!. కానీ ఇది నిజం అని బల్లగుద్ది మరీ నమ్మకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

హారర్‌ మూవీలు చూసే అలవాటు ఉంటే..ఇంకా మంచిది అంటున్నారు పరిశోధకులు. హాయిగా హారర్‌ మూవీలు చూస్తూ.. ఈజీగా కేలరీలు తగ్గించుకోండి అని అంటున్నారు. ఈ మేరకు వెస్ట్‌మినిస్టర్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం మూవీ రెంటల్‌ కంపెనీ సాయంతో సుమారు పదిమందిపై ఈ పరిశోధన చేశారు. వారంతా హారర్‌ మూవీలు చూస్తున్నప్పుడూ.. వారికి హృదయ స్పందన రేటు, ఆక్సిజన్‌ తీసుకుని కార్బన్‌డయాక్సైడ్‌ని వదులుతున్న రేటును కొలిచే పరికరాలను కూడా అమర్చారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న ఆ పదిమందికి సినిమాలు చూస్తున్నప్పుడూ.. హృదయ స్పందన రేటు, జీవక్రియ రేటు పెరిగాయని, తత్ఫలితంగా ఎక్కువ కేలరీలు బర్న్‌ అయినట్లు కనుగొన్నారు. అంతేగాదు ఈ కేలరీలు బర్న్‌ అవ్వడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని అన్నారు. కాగా ఈ పరిశోధనలో 90 నిమిషాల భయానక చిత్రం సగటున 150 కేలరీలను బర్న్‌ చేస్తుందని తెలిపారు. అది దగ్గర దగ్గరగా.. మనం చేసే జాగింగ్‌ లేదా 30 నిమిషాల పాటు చేసే వాకింగ్‌లో తగ్గే కేలోరీలకు సమానం అని చెప్పారు. తమ అధ్యయనం పాల్గోన్న ఆ పదిమంది చూసిన మొదటి పది రకాల భయానక చిత్రాలు వరుసగా ఎన్ని కేలరీలను బర్న్‌ చేశాయో కూడా వివరించారు.

ఒత్తిడి సమయంలో విడుదలయ్యే అడ్రినల్‌ వేగంగా విడుదలై ఆకలిని తగ్గించి, బేసల్‌ మెటబాలిక్‌ రేటును పెంచి అధిక స్థాయిలో కేలరీలను తగ్గిస్తుందని డాక్టర్‌ రిచర్డ్‌ మాకెంజీ అన్నారు. ఈ పరిశోధన రోజూవారి వ్యాయామాన్ని, సక్రమమైన ఆహారపు అలవాట్లను మానేయమని సూచించదని హెచ్చరించారు. ఆరోగ్యకరంగా బరువు, జీవనశైలి ఉండాలంటే హారర్‌ మూవీలు ఒక్కటే చూడటం సరిపోదని చెప్పారు. సులభంగా కేలరీలు తగ్గించే పరిశోధనల్లో భాగంగా ఈ కొత్త విషయాన్ని కనుగొన్నామే గానీ ఇదే సరైనదని చెప్పడం లేదన్నారు. 

(చదవండి: 'నాన్న బ్లడ్‌ బాయ్‌'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..)

మరిన్ని వార్తలు