నన్నడగొద్దు ప్లీజ్‌

6 Apr, 2017 23:42 IST|Sakshi
నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

సార్‌! నా పేరు రవి. వయసు 26. వన్‌ ఇయర్‌ నుంచి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. తన వయస్సు 33. ఆ అమ్మాయి తన ఇంటివారిని విడిచి ఒక పట్నంలో ఉంటూ స్టాఫ్‌ నర్స్‌గా ప్రైవేట్‌ ఆసుపత్రిలో పని చేస్తోంది. 10 సంవత్సరాల నుంచి తనకు, తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. నాకు అమ్మ, నాన్న, పెళ్లి అయిన ముగ్గురు అక్కలు ఉన్నారు. అక్కల పెళ్లిళ్ల సమయంలో అప్పులు చేశాం. కొన్ని అప్పులకు నేను కూడా సంతకం పెట్టాను.

ఇప్పుడు అమ్మా వాళ్లు వేరే సంబంధం చూసి వివాహం చేసుకోమంటున్నారు. నేను ప్రేమించే అమ్మాయి గురించి చెప్పాను. అమ్మాయి నీకంటే పెద్దది. జీవితంలో చాలా కష్టాలు పడతావు వద్దంటున్నారు. మా వాళ్ల మాట వినలేక, ఆమెను వదులుకోలేక బాధపడుతున్నా. అమ్మా నాన్న ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా రిసీవ్‌ చేసుకోలేకపోతున్నా. మీరు నాకు తగిన సలహా ఇవ్వండి. ప్రతిరోజు సాక్షిలో మీ సమాధానాలు చదువుతాను. చాలా బాగుంటాయి.
– రవి, ఈ మెయిల్‌

‘నన్ను అలా చూడకండి..’ నేను తల తిప్పేసుకున్నా.‘నన్ను చూసి అలా తల తిప్పేసుకోకండి. హాఫ్‌ టర్నింగ్‌ ఇచ్చి కూర్చోకండి’
బల్ల కింద తల పెట్టుకున్నా. ‘డర్టీ లుక్స్‌ ఇవ్వకండి’ ఫ్యాన్‌ చూస్తూ కూర్చున్నా. ‘ఇన్ని నాటకాలు వేసే బదులు నా ఏజ్‌ ఎంతో అడగొచ్చుగా..?’ ‘నీలాంబరీ! వాడెవడో రవి అట. థర్టీ త్రీ ఇయర్స్‌ నర్స్‌ను ప్రేమించాడు. కాబట్టి నీ వయస్సు ఎక్కడ అడుగుతానో అన్న అనుమానంతో నా ఫేస్‌ టర్నింగ్‌లు చేయించడం వెరీ వెరీ బాడ్‌ నర్స్‌గారు. హెడ్‌ ఎక్స్‌సర్‌సైజ్‌ అవుతుంది కానీ, నీ ఏజ్‌ తెలియదు కదా..’
‘యు వాంట్‌ టు నో మై ఏజ్‌..?’ అని ఉరిమి ఉరిమి చూసింది.

‘నీ ఏజ్‌ నాకు తెలియదా నీలూ... స్వీట్‌ సిక్స్‌టీన్‌... జెస్ట్‌ వన్‌ ఇయర్‌ హియర్‌ ఆర్‌ దేర్‌... అంతే కదూ..’ నీలాంబరి మిలమిలలాడుతున్న అరటిపండు చేతికి ఇచ్చి ‘యు ఆర్‌ చో.. చ్వీట్‌..’ అని ముద్దుగా చెప్పింది. రవీ! అమ్మాయి ఏజ్‌... నీ ఈగో గేజ్‌ అంతా జాన్తా నహీ. ఇంటి అప్పులు తీర్చి ఇంటి వాడవైపో...
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు