Dhootha Web Series Review: 'దూత' రివ్యూ.. సిరీస్ హిట్టా? ఫట్టా?

1 Dec, 2023 13:35 IST|Sakshi
Rating:  

టైటిల్: 'దూత' వెబ్ సిరీస్
నటీనటులు: నాగచైతన్య, ప్రియ భవాని శంకర్, పార్వతి తిరువతు, పశుపతి తదితరులు
నిర్మాత: నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్
డైరెక్టర్: విక్రమ్ కే కుమార్
మ్యూజిక్: ఇషాన్ చబ్రా
సినిమాటోగ్రఫీ: మికాలాజ్ సైగుల
విడుదల తేదీ: 2023 డిసెంబర్ 01
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్: 8

స్టార్ హీరోల సినిమాలు కరోనా టైంలో డైరెక్ట్ ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి గానీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నేరుగా మన తెలుగు హీరోలు నటించలేదు. ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్య.. తొలిసారి ఓ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. 'దూత' పేరుతో దీన్ని వెబ్ సిరీస్ గా తీశారు. తాజాగా ఇది ఓటీటీలో రిలీజ్ అయింది. థ్రిల్లర్ కథతో తీసిన ఈ సిరీస్ ఎలా ఉంది? టాక్ ఏంటనేది? ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.

కథేంటి?
సాగర్ వర్మ(నాగ చైతన్య) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. విలువలు కంటే డబ్బే ముఖ్యం. కొత్తగా పెట్టిన 'సమాచార పత్రిక' న్యూస్ పేపర్ కి చీఫ్ ఎడిటర్ గా అప్పాయింట్ అవుతాడు. ఈ బాధ్యతలు అందుకున్న కాసేపటి తర్వాత చిన్న పేపర్ క్లిప్ దొరుకుతుంది. సాగర్ కారుకి ఏక్సిడెంట్ అయ్యి అందులో కుక్క చనిపోతుంది అని రాసి ఉంటది. సాగర్ ఇది చదివిన క్షణాల్లోనే అలానే ప్రమాదం జరుగుతుంది. ఇలానే పేపర్ క్లిప్స్ సాగర్ కి దొరకడం, అతడి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వరసగా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకీ వీళ్ళ చావులకి, పేపర్ క్లిప్స్ తో సంబంధం ఏంటి? వీళ్లనే ఎందుకు చంపుతున్నారు? డీసీపీ క్రాంతి(పార్వతి), సత్యమూర్తి (పశుపతి)కి సాగర్ తో లింక్ ఏంటి అనేదే 'దూత' స్టోరీ.

ఎలా ఉంది?
తన ఫ్రెండ్ అయిన జర్నలిస్ట్ కాసేపట్లో చనిపోతాడని హీరో జర్నలిస్ట్ కి తెలుస్తుంది. దీంతో భయపడతాడు. పరిగెత్తుకుని మరి వెళ్లి అతడి చావుని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ తన కళ్ళ ముందే.. జర్నలిస్ట్ ఫ్రెండ్ నోట్లో గన్ పెట్టుకుని కాల్చుకుని చనిపోవడం హీరో చూస్తాడు. ఇది ఒక్కటే కాదు ప్రతిసారీ ఎవరో ఒకరు చనిపోతారని ముందు తెలియడం, వాళ్ళని కాపాడటానికి వెళ్లేలోపు వాళ్ళు చనిపోవడం.. చదువుతుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది కదా.. స్క్రీన్ పై చూస్తుంటే ఇంకా మజాగా ఉంటుంది. దూత సిరీస్ గురించి సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే.

స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుని హీరో సాగర్ చనిపోవడానికి ట్రై చేసే సీన్ తో ఈ వెబ్ సిరీస్ మొదలవుతుంది. కట్ చేస్తే టైటిల్స్ పడతాయి. స్టోరీ ఆరు రోజులు క్రితానికి వెళ్తుంది. 'సమాచార పత్రిక ' న్యూస్ పేపర్ లాంచ్, దీనికి చీఫ్ ఎడిటర్ గా సాగర్ నియామకం, కాసేపటి తర్వాత ఫ్యామిలీతో కలిసి సాగర్... కార్ లో ఇంటికి రిటర్న్ వెళ్తుండగా ఓ దాబా దగ్గర కారు ఆగిపోతుంది. పక్కనే ఉన్న హోటల్ కి సాగర్ వెళ్తే అక్కడ.. కాసేపట్లో తన కార్ కి ఏక్సిడెంట్ అవుతుందని, కుక్క చనిపోతుందని ఉంటుంది. సరిగ్గా అలానే జరుగుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే స్టోరీ పరిగెడుతుంది. కుక్క దగ్గర నుంచి స్టార్ట్ అయినా చావులు.. ఓ లారీ డ్రైవర్, యూట్యూబర్.. ఇలా ఎపిసోడ్ కి ఒకటి చొప్పున జరుగుతుంటాయి.

మరోవైపు సాగర్ ఓ హత్య చేస్తాడు. అతడ్ని అరెస్ట్ చేయాలని డీసీపీ క్రాంతి.. ఆధారాలు సేకరించే పనిలో ఉంటది. ఇంతకీ ఈ హత్యలకు.. అప్పుడెప్పుడో స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఉన్న 'దూత' అనే న్యూస్ పేపర్ కి లింక్ ఏంటనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. అయితే ఈ సిరీస్ లో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. మొదట్లో కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వున్నాయా అనిపిస్తుంది. కానీ చివరి రెండు ఎపిసోడ్స్ లో మొత్తం లింక్స్ అన్ని డైరెక్టర్ కనెక్ట్ చేసిన తీరు మంచి హై ఇస్తుంది. ఇక వెబ్ సీరీస్ లో 'f వర్డ్' తో పాటు ఓ బూతు పదేపదే వినిపిస్తుంది. కానీ కథకి అది ఏం ఇబ్బంది అనిపించదు. అలానే సిరీస్ లో చూపించే చావులన్ని కొంచెం హారిబుల్ గా ఉంటాయి. వీటికి ముందే ప్రిపేర్ అయితే సిరీస్ తెగ నచ్చేసింది.

ఎవరెలా చేశారు?
నాగ చైతన్యకి ఇది ఓటీటీ ఎంట్రీ. ఫస్ట్ వెబ్ సిరీస్ తోనే హిట్టు కొట్టేశాడు. సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో సెటిల్డ్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. డీసీపీ క్రాంతిగా మలయాళ నటి పార్వతి తిరువత్తు.. బాగా చేసింది. సాగర్ భార్య ప్రియాగా చేసిన ప్రియ భవాని శంకర్ కూడా ఉన్నంతలో అలరించింది. ఇకపోతే డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్రహ్మీ కొడుకు రాజ గౌతమ్ కనిపించింది కాసేపే అయిన నెగటివ్ రోల్స్ లో డిఫెరెంట్ గా కనిపించారు. మిగిలిన వాళ్ళందరూ పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ విషయాలకు వస్తే.. డైరెక్టర్ అండ్ రైటర్ విక్రమ్ కే కుమార్ ని మెచ్చుకుని తీరాలి. చాలా రోజుల తర్వాత తను గతంలో తీసిన '13B' లాంటి థ్రిల్లర్ కథతో కేక పుట్టించారు. సిరీస్ లో సీన్స్ అన్ని కూడా నైట్, వర్షంలోనే ఉంటాయి. వాటన్నిటినీ సినిమాటోగ్రాఫర్ బ్యూటిఫుల్ గా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 

ఓవరాల్ గా చెప్పుకుంటే.. 'binge watch' సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారా.. 'దూత' బెస్ట్ ఆప్షన్.

Rating:  
(3/5)
మరిన్ని వార్తలు