నన్నడగొద్దు ప్లీజ్‌

13 Dec, 2017 00:02 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌..! నా ఫ్రెండ్‌ ఒక అబ్బాయిని లవ్‌ చేసింది. కానీ, ఆ అబ్బాయి వాళ్ల పేరెంట్స్‌ ఒప్పుకోవట్లేదట. దాంతో ‘నన్ను మరిచిపో’ అని నా ఫ్రెండ్‌కి చెప్పాడట. ప్రాణంగా ప్రేమిస్తున్నానని నమ్మించి.. ఇప్పుడు పేరెంట్స్‌ ఒప్పుకోవడం లేదనే కారణంతో మరిచిపోమంటున్నాడు. అయితే నా ఫ్రెండ్‌ చాలా సిన్సియర్‌గా లవ్‌ చేస్తోంది. అందుకే చాలా బాధపడుతోంది. ఏదైనా సలహా చెప్పండి సార్‌?
– దీపిక

దొంగ వాడు!!‘సార్‌ అబ్బాయిలను పట్టుకుని దొంగా గింగా అంటే నేను ఒప్పుకోను సార్‌!!’నేను గింగా అనలేదు..!?! ‘సార్‌.. మీరు ఇలా అతి తెలివి చూపించి తప్పించుకోవాలని చూస్తున్నారు కానీ, బుక్కైపోతారు జాగ్రత్త!’మరి వాడు చేసిన పని ఏంటి???‘ఏంటి సార్‌! వాళ్ల పేరెంట్స్‌ కుదరదు అన్నాక ఏం చేస్తాడు సార్‌..??’వాడు వాళ్ల అమ్మనడిగి ప్రేమించాడా? అయ్యనడిగి ప్రేమించాడా?‘సార్‌ అమ్మా అయ్యా అనకండి బాగుండదు..!! అబ్బాయిలు హర్ట్‌ అవుతారు సార్‌!’ప్రేమించేటప్పుడు అమ్మా.. అయ్యలను అడగకుండా ప్రేమిస్తారు. అమ్మాయితో షికార్లు కొట్టినప్పుడు అమ్మా.. అయ్యలను అడగరు. నువ్వు లేక నేను లేనని ఎమోషనల్‌ డైలాగ్స్‌ కొట్టేముందు అమ్మా.. అయ్యలను అడగరు. సరిగ్గా పెళ్లి విషయం మాట్లాడిన వెంటనే అమ్మా.. అయ్యా.. గుర్తుకొస్తారు. అమ్మాయిలను ప్రేమ నడిరోడ్డు మీద వదిలేసి నెక్ట్స్‌ లవ్‌స్టోరీ మొదలు పెడతారు. నాకు తెలిసి అసలు తల్లిదండ్రులకు వీడి ఎంకమ్మ వ్యవహారాలు అసలు తెలియదేమో...!? నేనే ఆ అమ్మాయి అన్నయ్యనైతే.. వాళ్ల ఇంటికి వెళ్లి ఇలాగే అడుగుతా..!

కడిగేస్తా కొడుకుని..!! హమ్మా..!! ఎంత చులకన అయిపోయింది అమ్మాయి, అమ్మాయి ప్రేమ!?! తాట తియ్యాలి. నువ్వేమో తెగ ఫీల్‌ అయిపోతున్నావు వాళ్ల తల్లిదండ్రులను ఏదో అన్నానని! నేనేమన్నాను..?? ఏ తల్లిదండ్రులు కూడా ఇంకో ఇంటి అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరు! వీడు చెప్పిన అబద్ధానికే నాకు మండిపోయింది. అబ్బాయి అమ్మనాన్నలు లక్షణమైన బంగారాలే అని నేను నమ్ముతున్నాను. వాళ్లకు ఇలాంటి ప్రబుద్ధుడు ఎలా పుట్టాడన్నదే నా ఆవేశానికి కారణం!‘సార్‌ తగ్గండి సార్‌ ఇదిగో అరటిపండు, తిని చెప్పండి సార్‌ ఆ అమ్మాయి ఏం చెయ్యాలో..!’పెంటగాడి నీడ తొలిగిపోయిందనుకుని తను హ్యాపీగా జీవించడం ఒక ఆప్షన్‌. ఇంకో అమ్మాయిని ఇలా చెయ్యకుండా నిలదీయడం ఇంకో ఆప్షన్‌. పరిస్థితులు ఎలా అనుకూలిస్తే అలా చెయ్యడం కరెక్ట్‌! కానీ, ఊరికే డిప్రెషన్‌తో ఫీల్‌ అవడం మాత్రం నాట్‌ ఓకే!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు