మేకప్!

29 Oct, 2014 23:53 IST|Sakshi

చేపల్లాంటి కనులు...
కేశాలంకరణలో ‘ఫిష్ టెయిల్’ చాలామందికి సుపరిచితమే! ఐ మేకప్‌లోనూ ‘ఫిష్ టెయిల్’ అమితంగా ఆకట్టుకుంటుంది. మన సంప్రదాయం కాస్త.. ఈజిప్షియన్ స్టైల్ ఇంకాస్త జోడించి లైనర్‌తో కంటిని తీర్చిదిద్దితే ‘ఫిష్ టెయిల్’ కనువిందు చేస్తుంది. యువతులను ఆకర్షిస్తున్న ఈ స్టైల్‌ను అనుసరించాలంటే...
 
 కంటి ముందు భాగం నుంచి చివరల వరకు రెప్పలకు లైనర్‌తో పొడవైన గీతలా తీర్చాలి. ఆ తర్వాత లైనర్‌తో మరింత చిక్కగా వచ్చేలా కనురెప్ప మధ్య భాగం నుంచి చివర వరకు దిద్దాలి.
 
 ఇలాగే పై కనురెప్పను (టియర్ లైన్ నుంచి చివరి వరకు) తీర్చిదిద్దాలి.
 
 ఐ షాడోతో పై కనురెప్పను అలంకరించాలి.
 
 మేలిమి!
 క్యాప్సికమ్!

ఎరుపురంగు క్యాప్సికమ్ ఉడికించి లేదా పచ్చిగా ఇతర పండ్లు, కూరగాయల సలాడ్స్‌తో కలిపి తింటే ఆరోగ్యానికి, చర్మ కాంతికి మేలైన ప్రయోజనాలు కలుగుతాయి..
 
క్యాప్సికమ్‌లో శరీరానికి కావ ల్సిన విటమిన్ ‘సి’, పీచుపదార్థాలు, విటమిన్ ‘బి6’ సమృద్దిగా వుంటాయి.
 
దీంట్లో అధిక మొత్తంలో ఉండే కెరొటినాయిడ్స్ రక్తప్రసరణను మెరుగు పరిచి, చర్మంపై ముడతలను నివారిస్తుంది. అందుకని మధ్య వయసు వారు దీనిని తప్పక తీసుకోవాలి.
 
టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు రోజూ కొద్ది మోతాదులో దీనిని ఆహారంలో భాగంచేసుకుంటే మొటిమల సమస్య దరిచేరదు. మచ్చలు ఏర్పడవు. దీంట్లో కొవ్వు తక్కు వగా ఉండటం వల్ల అధికబరువుకు దూరంగా ఉండవచ్చు.
 
 మెరుగు!

చెడువాసన వస్తుంటే...

కాలంతో సంబంధం లేకుండా కొందరి శరీరం నుంచి చెడు వాసన వస్తుంటుంది. దీనిని పోగొట్టడానికి పెరఫ్యూమ్‌లు, పౌడర్ల వాడకం కన్నా దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల 99 శాతం సమస్యను నివారిం చవచ్చు. సాధారణంగా చెడు వాసన అనేది స్వేదరంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఉత్పన్నమవుతుంది. చర్మంపై మృతకణాలు పేరుకుపోయి, చెమటతో కలిసి జిడ్డుగా ఏర్పడుతుంది. ఈ జిడ్డును సరిగ్గా వదిలించకపోతే చెడు వాసన ఎక్కువవుతుంది. ఈ సమస్య నివారణకు ... రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో ‘బాడీ బ్రష్’తో చర్మంపై వలయకారంలా మృదువుగా రుద్దాలి. పైకి, కిందకు రుద్దుతూ ఇలా స్నానం చేయడం వల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. వాడిన బ్రష్‌ను ప్రతిసారి పొడిగా ఉంచాలి. 6 నెలలకు ఒకసారి పాత బ్రష్‌ను మారుస్తూ ఉండాలి. ఒకరు వాడిన బాడీ బ్రష్‌ను మరొకరు వాడకూడదు.
 

మరిన్ని వార్తలు