ఉద్దానంలోని మరణాలకు గల కారణాన్ని కనిపెట్టిన పరిశోధకులు! చాలా మరణాలు..

22 Nov, 2023 17:25 IST|Sakshi

'ఉద్దానం' ఈ పేరు చెప్పగానే అందరూ ఉలిక్కిపడతారు. ఎందుకంటే?  కిడ్నీ వ్యాధి కారణంగానే దాదాపు వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఊరుగా వార్తల్లో నిలిచింది. అక్కడ అందరి చావులు ఒకేలా ఉండటం. ఎక్కువ మంది కిడ్నీ వ్యాధి బారినేపడటం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో నిర్థారించేరే తప్ప అందుకు గల కారణాలపై అధ్యయనం చేయలేదు. ఇప్పుడిప్పుడూ ‍ప్రభుత్వం చొరవ తీసుకుని ఆరోగ్య క్యాంపులతో అక్కడి ప్రజలకు వైద్యం అందిస్తోంది. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించుకోలేని వారందరికీ ఉచిత వైద్యం అందించే యత్నం చేస్తోంది. కానీ అందరూ కిడ్నీ వ్యాధినే బారిన పడటానికి కారణం ఏంటీ? ఆ వ్యాధి తీరు ఏంటన్నది అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయింది. ఐతే తాజగా జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకుల బృందం అందుకు గల కారణాన్ని కనుగొనడమే గాక పరిష్కార మార్గాల గురించి వెల్లడించింది. 

వివరాల్లోకెళ్తే..జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకుల బృందం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, ఉద్దానంలో జరగుతున్న మరణాలకు ప్రధాన కారణం మూత్ర పిండాల పనితీరుని క్రమంగా కోల్పోయే క్రానిక్‌ కిడ్నీ డిసిజీ(సీకేడీ) అని తేల్చి చెప్పారు. సీకేడీ కారణంగానే అధిక సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు చెప్పుకొచ్చారు. సాధారణ కిడ్నీ వ్యాధికి ఈ క్రానిడ్‌ కిడ్నీ డిసీజ్‌కి చాలా తేడా ఉంది అందేంటంటే.

సాధారణ కిడ్నీ వ్యాధీ.. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం లేదా వాటి పనితీరును కోల్పోతే దీన్ని సాధారణ కిడ్నీ వ్యాధి అంటారు. అలా కాకుండా కాల క్రమేణ మూత్ర పిండాలు తమ పనితీరును కోల్పోతే దాన్ని క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ లేదా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అని అంటారు. ముఖ్యంగా రక్తపోటు, మదుమేహం వంటి దీర్ఘకాలి వ్యాధుల కారణంగానే ఈ సీకేడీ మూత్రపిండాల వ్యాధి వస్తుంది. ఇక ఉద్ధానంలోని ప్రజల మరణాలకు కారణమైన ఈ క్రానిక్‌ కిడ్నీ డిజీజ్‌పై అధ్యయనం చేసేందుకు స్మార్ట్ వెర్బల్ శవపరీక్ష సాధనాన్ని వినయోగించింది పరిశోధకుల బృందం.

ఔదీని సాయంతోనే మరణించిన వ్యక్తు డేటా తోపాటు బతికి ఉన్న బాధిత కుటుంబ సభ్యుల ఆరోగ్య డేటాను తీసుకుని విశ్లేషించారు. అలాగే వారందరి తోపాటు చనిపోయిన మిగతా ప్రజల ఆరోగ్య డేటాను కూడా తీసుకుని కంప్యూటర్‌ అల్గారిథమ్‌ సాయంతో ఆ మొత్తాన్ని విశ్లేషించి ఈ పరిస్థితి గల కారణల గురించి వెల్లడించారు. దాదాపు రెడు వేలకు పైగా వ్యక్తుల డేటా అధారంగా ఈ క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌(సీకేడీ) ప్రధాన కారణమని నిర్థారించామని పరిశోధకులు తెలిపారు. ఉద్ధానంలోని ప్రజలపై ఈ సీకేడీ ప్రభావం ఏ స్థాయిలో  ఉందో కూడా ఈ పరిశోధన వెల్లడించినట్లు  పేర్కొన్నారు. 

అధ్యయనంలోని ముఖ్యాంశాలు..

  • ఉద్ధానంలో మరణించిన మరణాల్లో దాదాపు 45% వరకు ఈ సీకేడీ వల్లనే అని పరిశోధకులు వెల్లడించారు. 
  • దాదాపు 5.5 మరణాల రేటు దీని కారణంగానే సంభవించాయి. వయసు సుమారుగా 20 అంతకు పైబడిన వారే ఈ వ్యాధి బారిన పడటం అనేది కలవరపరిచే అంశంగా చెప్పుకొచ్చారు
  • అక్కడ జరగుతున్న మరణాలకు ప్రధాన కారణం సీకేడీ అని నిర్ధారణ అయ్యింది
  • స్మార్ట్ వెర్బల్ శవపరీక్ష (SmartVA) సాయంతో ఈసమస్యను చక్కబెట్టగలమన్నారు. ఈ సాధనం సాయంతో మరణాల డేటాతోపాటు ఉద్దనంలో ఉన్న మిగతా ప్రజల ఆరోగ్య డేటాను తీసుకుని సాధ్యమైనంత వరకు మళ్లీ మరణాలు పునరావృత్తం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు పరిశోధకులు. 

ఈ మేరకు  జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రోఫెసర్‌ వివేకానంద ఝూ మాట్లాడుతూ.. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య మాత్రమే కాదు ఉద్ధానంలో మరణానికి ప్రధాన కారణమని తమ అధ్యయనం వెల్లడించిందని తెలిపారు. ఈ సీకేడీ వ్యాధిని నివారించాలంటే..ముందుగా ఈ వ్యాధిని సక్రమంగా నిర్ధారించడం తోపాటు తక్షణమే సరైన చికిత్స అందించి నివారించడం అత్యంత ముఖ్యం అని చెప్పారు. ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్య అధికారులతో తాము కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. అలాగే బాధితులకు కూడా మెరుగైన చికిత్స అందించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ పరిశోధనలో డాక్టర్‌ బాలాజీ గుమ్మిడి, డాక్టర్‌ వైశాలి గౌతమ్‌, డాక్టర్‌ రేణు జాన్‌, డాక్టర్‌ రోహినా జోషి, డాక్టర్‌ ఊమెన్‌ జాన్‌ తదితరలు పాలుపంచుకున్నారు. 

(చదవండి: ఎక్స్‌ట్రీమ్‌ వెయిట్‌ లాస్‌ స్టార్‌ జస్ట్‌ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?)

మరిన్ని వార్తలు