ఆయనంటేనే అసహ్యం!

8 Sep, 2015 23:11 IST|Sakshi
ఆయనంటేనే అసహ్యం!

మ్యారేజ్ కౌన్సెలింగ్

మా పెళ్లై ఆరేళ్లైనా సంతానం కలగకపోవడంతో ఎన్నో హాస్పిటల్స్‌కి వెళ్లాను. అన్ని పరీక్షల అనంతరం నాలో ఏ లోపం లేదని తెలిసింది. డాక్టర్స్ మావారిని కూడా పరీక్షించాలన్నారు. కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. ఇదిలా ఉండగా నాకొక దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసింది. మావారు నాకు చెప్పకుండా ఏనాడో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారట. అది తెలిశాక నాకు ఆయన ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఏం చేయాలి?
 - మాళవిక, మదనపల్లి

హిందూ వివాహ చట్టం సెక్షన్ 13ను అనుసరించి ‘క్రూరప్రవర్తన’ విడాకులు తీసుకోవడానికి ఒక ఆధారమవుతుంది. అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు. సరైన వైద్యకారణాలు ఏమీ లేకుండా భర్త లేదా భార్య రహస్యంగా పిల్లలు కలుగకుండా ఆపరేషన్ చేయించుకుంటే అది క్రూరత్వమే అవుతుంది. భార్యా భర్తలలో ఒకరికి తెలియకుండా మరొకరు  ఇలా చేయడం క్రూరత్వమేనని, ఆ కారణం మీద విడాకులు ఇవ్వవచ్చునని సుప్రీంకోర్టు అనేక కేసులలో తీర్పు చెప్పింది. మీరు అన్ని వివరాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించండి.
 
 - ఇ. పార్వతి
 అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్

మరిన్ని వార్తలు