మెదక్‌లో పండగపూట విషాదం.. టపాసులు కొనడానికి వెళ్తుండగా..

12 Nov, 2023 15:23 IST|Sakshi

సాక్షి, మెదక్ జిల్లా: మెదక్‌లో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీని టిప్పర్‌ ఢీకొనడంతో పృథ్వీతేజ్(12), ప్రణీత్ తేజ్(12) ప్రాణాలు కోల్పోయారు. తల్లికి అన్నపూర్ణకు గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు.

దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కొనడానికి తల్లితో పాటు కలిసి చిన్నారులు స్కూటీపై వెళ్తుండగా ఘటన జరిగింది. అన్నపూర్ణ భర్త శ్రీనివాస్ హోం గార్డ్.. రెండు సంవత్సరాల క్రితమే ఆయన ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

చదవండి: వీడియో కాల్‌లో డబ్బులు అడుగుతున్నారా?.. ఇది తెలుసుకోండి..

మరిన్ని వార్తలు