పుట్టగొడుగులతో జాబిల్లిపై ఇళ్లు?

20 Jan, 2020 03:51 IST|Sakshi

పరి పరిశోధన

వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుందిగానీ.. భవిష్యత్తులో జాబిల్లిపై కట్టే ఇళ్లు ఇతర ఆవాసాలకు పుట్టగొడుగులను వాడతారట! అదెల? అని ఆశ్చర్యపోనవసరం లేదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ అంశంపై ఇప్పటికే కొంత పనిచేసింది. చంద్రుడితోపాటు అంగారకుడు.. ఇతర గ్రహాలపై కూడా పుట్టగొడుగులు (శాస్త్రీయ నామం మైసీలియా ఫంగస్‌)ను పెంచడం ద్వారా ఇళ్లు, భవనాలను కట్టేయవచ్చునని నాసా అంటోంది. అంతేకాదు. అంగారకుడి మట్టిపై పుట్టగొడుగులు పెంచడం ఎలా అన్నది కూడా ఇప్పుడు పరీక్షిస్తోంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఇతర గ్రహాలపై ఆవాసాలకు ఇక్కడి నుంచి సామాగ్రి మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. నిద్రాణ స్థితిలో ఉన్న పుట్టగొడుగులు కొన్నింటిని తీసుకెళితే చాలు.

ఆ గ్రహం చేరిన తరువాత వాటిని పెంచేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తే చాలని, సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకోగల బ్యాక్టీరియా అందిస్తే పెరుగుతున్న క్రమంలోనే పుట్టగొడుగుల ఆకారాన్ని కూడా నిర్ణయించవచ్చునని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా పెరిగిన వాటిని వేడి చేస్తే.. ఇటుకలు సిద్ధమవుతాయి. వాటితో ఎంచక్కా మనకు కావాల్సిన నిర్మాణాలు చేసుకోవచ్చునన్నమాట!  అంతేకాదు.. ఇటుకలుగా మారకముందు పుట్టగొడుగుల సాయంతో నీటిని, మలమూత్రాలను శుభ్రం చేసుకుని వాటి నుంచి ఖనిజాల్లాంటివి రాబట్టుకోవచ్చునని  నాసాలోని ఏమ్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రధాన శాస్త్రవేత్త లిన్‌ రోథ్స్‌ఛైల్డ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు