ట్యూనిక్... ‘ట్యూన్’ మార్చేయచ్చు...

26 May, 2016 23:25 IST|Sakshi
ట్యూనిక్... ‘ట్యూన్’ మార్చేయచ్చు...

న్యూలుక్

అమ్మాయిలు జీన్స్ మీదకు ధరించే ట్యూనిక్స్‌లో ఎన్నో విభిన్న మోడల్స్ వచ్చాయి. అయితే అవన్నీ ఒకే తరహా డిజైన్‌ని పోలి ఉంటాయి. కొంత సృజనను జోడిస్తే మీ పాత ట్యూనిక్‌ను ఇలా అందంగా, అధునాతనంగా మార్చేయవచ్చు. ప్లెయిన్ లాంగ్ స్లీవ్స్ లేదా షార్ట్ స్లీవ్స్ ట్యూనిక్‌ను తీసుకోవాలి. పెద్దా, చిన్న ప్రింట్లు ఉన్న మల్టీకలర్ క్లాత్‌ను తీసుకోవాలి. దీంతో పాటు మరొక గ్రే కలర్ లేస్‌ను ఎంచుకోవాలి.


ట్యూనిక్ నెక్ నుంచి కింద వరకు సైడ్ స్ట్రిప్‌గా మల్టీకలర్ ప్రింట్ క్లాత్‌ను కత్తిరించి, బెల్ట్‌లా కుట్టి జత చేయాలి. అదే విధంగా నెక్ డిజైన్ చేయాలి. మల్టీకలర్ క్లాత్‌ని కుచ్చులుగా పెట్టి టాప్‌కి ట్యునిక్ కింది భాగాన జత చేయాలి. దీని కింద గ్రే కలర్ లేస్‌ను పెద్ద పెద్ద కుచ్చులు పెట్టి జత చేయాలి. పాత సాదా సీదా  నలుపురంగు టాప్ ఆకర్షణీయమైన పార్టీవేర్‌గా మారిపోయింది.

 

మరిన్ని వార్తలు