లవ్ యూ ప్రెస్లీ!

16 Dec, 2014 23:27 IST|Sakshi
లవ్ యూ ప్రెస్లీ!

ఎల్విస్ ప్రెస్లీ (1935-1977) కీర్తికి కాలంతో పనిలేదు. దానికి ‘అవుట్ డేటెడ్’ అనే స్టిక్కరు కూడా లేదు. అందుకే...ఇప్పటికీ ‘ప్రెస్లీ’ అనే పేరు వినగానే  ఏదో పాట విన్నట్లుగా పాదాల్లో కదలిక వస్తుంది. గొంతులో రాగాల జల ఊరుతుంది. గతంలో ఎప్పుడూ  జరగని విధంగా... ఈ అమెరికన్ రాక్  ‘ఎన్’ రోల్ రారాజు వ్యక్తిగత వస్తువులతో ఒక భారీ ఎగ్జిబిషన్  లండన్‌లో  ప్రారంభం అయింది. ఇందులో ప్రెస్లీకి చెందిన రకరకాల వస్తువులు, వాహనాలు, దుస్తులు ఉన్నాయి.

ఈ ప్రదర్శనలో  కారు లాంటి వాహనాలతో బాటు, గోల్డెన్ టెలిఫోన్,  1973లో మహ్మద్ ఆలి ప్రెస్లీకి అభిమానంగా బహూకరించిన గోల్డెన్ బాక్సింగ్ గ్లోవ్స్‌లాంటి విలువైన వస్తువులు,  కీ చైన్‌లాంటి చిన్న వస్తువులే కాదు, ప్రెస్లీ జూనియర్ స్కూల్ రిపోర్ట్‌లు కూడా  ఉన్నాయి.  ఈ ప్రదర్శన  తొమ్మిది నెలల పాటు కొనసాగుతుంది. వస్తువులను వస్తువులుగానే చూడనక్కర్లేదు...అందులో వ్యక్తిగత అభిరుచితో పాటు జీవితం కూడా ప్రతిఫలిస్తుంది. ఆ రకంగా ప్రెస్లీ  జీవితాన్ని విశ్లేషించడానికి అవసరమైన భారీ ముడి సరుకు  ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లే!
 
 

మరిన్ని వార్తలు