మిస్ యూనివర్స్ 2023: భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న 23 ఏళ్ల శ్వేతా శార్ధా

18 Nov, 2023 12:23 IST|Sakshi

ప్రతిష్టాత్మక 72వ మిస్ యూనివర్స్​ అందాల పోటీలు ఫైనల్‌కు చేరుకున్నాయి.ఎల్ సాల్వడార్‌లో వేదికగా ఆదివారం ఉదయం 9గంటలకు(భారత కాలమానం ప్రకారం).. మిస్‌ యూనివర్స్‌2023 ఎవరో తేలిపోనుంది. 90 దేశాలకు చెందిన అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. భారత్‌ నుంచి 23ఏళ్ల శ్వేతా శార్దా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన నేషనల్ కాస్ట్యూమ్ షోలో శ్వేత ధరించిన కాస్ట్యూమ్స్‌ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారాయి.

రీగల్‌ ఎంబ్రాయిడరీతో చేసిన దుస్తులు ధరించి శ్వేత దేవకన్యలా మెరిసింది. జాతీయ పుష్పం కమలం స్ఫూర్తితో రూపొందించిన కిరీటం ధరించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.దీంతో పాటు జాతీయ పక్షి నెమలి ప్రతిబింబించేలా కాస్ట్యూమ్‌ను ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. సవాళ్లను ఎదుర్కొనే, అభివృద్ధి చెందుతున్న దృఢమైన భారత్‌కు ప్రతీకగా ఈ కాస్ట్యూమ్‌ను డిజైన్‌ చేసినట్లు డిజైనర్‌ నిధి యశా తెలిపింది. ప్రస్తుతం శ్వేతా శార్దా లేటెస్ట్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

A post shared by Miss Diva (@missdivaorg)


ఎవరీ శ్వేతా శార్దా?
చండీగఢ్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా శార్దా ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఈ ఏడాది భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. 16 ఏళ్ల వయసులో తన తల్లితో కలిసి ముంబై చేరిన శ్వేత చిన్నతనంలోనే డ్యాన్స్‌పై మక్కువ ఏర్పరుచుకుంది. ఇప్పటివరకు ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’, ‘డ్యాన్స్‌ దీవానే’ వంటి పలు రియాలిటీ షోల్లో ఆమె పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా గ్రూప్‌లో భాగమైన ‘మిస్‌ దివా యూనివర్స్‌-2023’ కిరీటాన్ని  సొంతం చేసుకుంది. మరి మిస్‌ యూనివర్స్‌గా సత్తా చాటుతుందా అన్నది చూడాల్సి ఉంది.  భారత్‌ నుంచి చివరగా 2021లో హర్నాజ్ సంధు మిస్‌ యూనివర్స్‌గా గెలుపొందిన విషయం తెలిసిందే.


 

A post shared by Miss Diva (@missdivaorg)


 

మరిన్ని వార్తలు