ఛీఛీ..ఇదేం విడ్డూరమో, యూట్యూబర్‌ చేసిన పనికి నెటిజన్లు షాక్‌

18 Nov, 2023 11:09 IST|Sakshi

గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ గుడ్లు తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. దీంట్లో ‍ప్రోటీన్లతో పాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌ ఉంటాయన్నది నిజమే. కొందరు రోజూ ఉడికించిన గుడ్డు తీసుకుంటే మరికొందరు పచ్చిగుడ్డు తీసుకుంటారు. అయితే ఓ యూట్యూబర్‌ మాత్రం ఏకంగా ఒకేసారి వంద పచ్చి గుడ్లను తిని నెట్టింట సెన్సేషన్‌గా మారాడు.


జిమ్‌ చేసేవాళ్లలో చాలామంది తమ డైట్‌లో తప్పకుండా గుడ్లు ఉండేలా చూసుకుంటారు. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుందని, శరీరానికి కావల్సినంత ప్రోటీన్‌ను అందిస్తుందని చాలామంది గుడ్లను తప్పకుండా రోజూ తీసుకుంటారు. అయితే ఓ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్యూయెన్సర్‌,యూట్యూబర్‌ మాత్రం పెద్ద సాహసమే చేశాడు. తన యూట్యూబ్‌ చానల్‌కు లక్ష ఫాలోవర్స్‌ వచ్చిన సందర్భంగా ఆడియెన్స్‌ కోసం ఏదైనా సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్నాడు.

అనుకుందే తడవుగా జిమ్‌లో ఓ పెద్ద మగ్గు నిండా 100 పచ్చి గుడ్లను నింపుకున్నాడు. ఇదేం చేస్తాడబ్బా అని చుట్టూ ఉన్నవాళ్లు చూసేలోపు మగ్గులోని సగానికి పైగా గుడ్లను ఖాళీ చేసేశాడు. తర్వాత కాస్త గ్యాప్‌ ఇచ్చి పుషప్స్‌ చేసి మళ్లీ పచ్చి గుడ్లను తాగడం కంటిన్యూ చేశాడు. అలా మొత్తం మగ్‌లోని వంద గుడ్లను తాగేసరికి అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫాలోవర్స్‌ కోసం ఇలాంటి పిచ్చి స్టంట్లు చేస్తే ప్రాణానికి ప్రమాదం..ఇంత ఓవర్‌ యాక్షన్‌ అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరోవైపు గుడ్డు తినడం మంచిది కదా అని అతిగా తీసుకుంటే చాలా ప్రమాదం అని డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు. 

A post shared by Vince Iannone (@vince_aesthetic)

మరిన్ని వార్తలు