అలోచనల మీద అదుపు...

2 Jun, 2017 23:58 IST|Sakshi
అలోచనల మీద అదుపు...

రమజాన్‌ కాంతులు

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలకు దూరంగా ఉంటూ ఉపవాస దీక్ష పాటిస్తారు. ఆకలిదప్పులతో ఉండటమే కాక అన్ని రకాల కోరికలను, వాంఛలను త్యజిస్తారు. చిత్తశుద్ధి్దతో, నిష్కల్మషంగా రోజా పాటించే వారికి దైవభీతి, జవాబుదారీతనం, సహనం, సద్గుణాలు అలవడతాయి, ఈ శిక్షణ రంజాన్‌కే పరిమితం కాదు. ఏడాది పాటు ఈ సద్గుణాలు సొంతం అవుతాయి. వ్యక్తిత్వ వికాసం వెల్లివిరుస్తుంది. ఉత్తమ వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించే ఉత్తమ గురువు లాంటిది రోజా.

రంజాన్‌ నెలలో పాటించే రోజాలు సమాజంలోని బీదసాదల ఆకలి దప్పులను తెలుపుతుంది. తోటి వారి వ్యధాభరిత జీవితాన్ని కళ్లకు కడుతుంది. తోటి వారు, ఆనాథలు, అణగారిన వారి పట్ల మృదుత్వం అలవడుతుంది. తోటివారి శ్రేయాన్ని కాంక్షిస్తారు. వారి బాధల్ని, కష్టాల్ని తీర్చేందుకు పాటుపడతారు.
– షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌

మరిన్ని వార్తలు