సువాసనల నూనెలోని సుగుణాలవి

16 May, 2018 00:00 IST|Sakshi

బ్యూటిప్స్‌

అరోమా ఎసెన్షియల్‌ ఆయిల్స్‌లోని సౌందర్యగుణాలను దేహం వెంటనే స్వీకరిస్తుంది. సాధారణంగా బాడీ మసాజ్‌కు ఉపయోగించే ఏదైనా ఆయిల్‌లో ఐదు చుక్కల రోజ్, లావెండర్‌... వంటి మీకు నచ్చిన అరోమా ఆయిల్‌ కలిపి వాడాలి. ఈ ఆయిల్‌ను పాదాలకు రాసి మర్దన చేస్తే ఆ సుగుణాలు ఇరవైనిమిషాలకు ఒంట్లోని ప్రతికణానికీ చేరతాయి.

అరోమా బాత్‌ శరీరంలోని మలినాలను తొలగించి, ఆహ్లాదాన్నిస్తుంది. స్నానం చేసే వేడినీటిలో నాలుగు చుక్కల అరోమా ఆయిల్‌ వేయాలి. ముందుగా ఒక కప్పు నీటిలో ఆయిల్‌ వేసి సమంగా కలిశాక మొత్తం నీటిలో కలపాలి. అరోమా బాత్‌ సాధ్యం కానప్పుడు వెడల్పుగా ఉన్న టబ్‌ తీసుకుని రెండు లీటర్ల వేడి నీటిని పోసి అందులో రెండు చుక్కల నూనె వేసి పాదాలను, చేతులను ముంచి పది నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల సువాసన నూనెలోని సుగుణాలు శరీరానికి అందుతాయి. 

>
మరిన్ని వార్తలు