పండుగ కళ కనిపించాలి

26 Oct, 2019 01:56 IST|Sakshi

అలంకరణ

పండుగ రోజున డ్రెస్‌కు తగ్గట్టు అలంకరణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అప్పుడే కళగా కనిపిస్తారు. కొందరు కేవలం ముఖం ఒక్కటే బాగుంటే చాలు అనుకుంటారు. అలా కాకుండా కాలి వేళ్ల నుంచి కేశాల వరకూ పండగరోజున ప్రత్యేక అలంకరణతో మెరిసిపోవచ్చు.

►డ్రెస్‌ ఎంపిక పండగ కళను రెట్టింపు చేసేదై ఉండాలి. చీరలైనా, డ్రెస్సులైనా.. కాంతిమంతమైన రంగులు, డిజైనర్‌ వర్క్, మిర్రర్‌వర్క్‌.. వంటివి సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి.

►ఎదుటివారి చూపు వేసుకున్న డ్రెస్‌ తర్వాత మన కేశాలంకరణ మీద పడుతుంది. తలకు నూనె పెడితే ముఖం జిడ్డుగా కనిపిస్తుంది కాబట్టి శిరోజాలను శుభ్రపరిచి, ఆరబెట్టుకున్నాక సంప్రదాయ అల్లికలను ఎంచుకోవాలి. వీటిలో జడ లేదా ముడులలోనే ప్రత్యేక అలంకరణలు బాగుంటాయి.

►ముఖారవిందానికి కళ తెచ్చేవి కళ్లు, కనుబొమ్మలు, పెదాలు. ఎండ, ఉక్కపోతను దృష్టిలో పెట్టుకొని ఫౌండేషన్‌ ఎక్కువ వాడకుండా కళ్లు, కనుబొమ్మలు, పెదాలను తీర్చిదిద్దుకోవాలి.

మరిన్ని వార్తలు