కడుపులోకి ‘కల్తీ’ కూట విషం..

26 Oct, 2019 01:52 IST|Sakshi

ఆర్గానిక్‌ స్టోర్లలో విక్రయించే నిత్యావసరాల్లోనూ అదే తీరు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నివేదికలో వెల్లడి

ఆకుకూరలు, పండ్లు, కూరగాయలలో పెస్టిసైడ్స్‌

నిత్యావసరాల్లో విషరసాయనాల ఆనవాళ్లు

సాక్షి, హైదరాబాద్‌: పండ్లు.. కూరగాయలు.. ఆకు కూరలు.. పప్పులు.. బియ్యం.. సుగంధ ద్రవ్యాలు.. గోధుమలు కాదేదీ పెస్టిసైడ్స్‌ (క్రిమి సంహారకాలు) ఆనవాళ్లకు అనర్హం అన్నట్లుగా మారింది ప్రస్తుత పరిస్థితి. హైదరాబాద్‌ వాసులు రోజువారీగా విని యోగిస్తున్న నిత్యావసరాలు, పలు రకాల ఆహార పదార్థాల నమూనాల్లోనూ ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ ఎస్‌ఏఐ) నిర్దేశించిన పరిమితికి మించి రసాయనాలు, క్రిమి సంహారక ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌ పరిధిలో బహిరంగ మార్కెట్ల, లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో మొత్తం గా సుమారు 30% మేర పెస్టిసైడ్స్‌ ఆనవాళ్లు బయటపడుతున్నాయి.

ఎరువులు, పురుగు మందుల అవశేషాలు లేని సేంద్రియ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నా మంటూ ప్రచారం చేసుకుంటున్న పలు సంస్థలు తమ ఆర్గానిక్‌ స్టోర్లలో విక్రయిస్తున్న నమూనాల్లోనూ ఈ ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆయా స్టోర్లలో సేకరించిన పలు రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్లోనూ విష రసాయనాల ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌ మెంట్‌ (హైదరాబాద్‌) ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా వీటి ఆనవాళ్లు బయటపడ్డాయి.  కూరల్లో వాడే కరివేపాకులోనూ వీటి ఆన వాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నమూనాలను నగరంలోని పలు బహిరంగ మార్కెట్లలో సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

అమ్మో క్రిమి సంహారకాలు..
క్రిమి సంహారకాల్లో ప్రధానంగా ఆర్గానో క్లోరిన్, ఎసిఫేట్, ఎసిటామిప్రిడ్, అజోక్సీ స్టార్బిన్, కార్బన్‌డిజం, ఇమిడాక్లోప్రిడ్, టిబ్యుకొనజోల్‌ తదితర క్రిమిసంహారక ఆన వాళ్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్దేశించి న పరిమితులకు మించి ఉంటున్నాయి. ఎసిఫేట్, లిండేన్‌ వంటి క్రిమి సంహారకాల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వాటి ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుగంధ ద్రవ్యమైన యాలకులలోనూ క్వినై ఫోస్, అజోక్సీస్టార్బిన్, థయామె టోక్సా మ్‌ వంటి క్రిమి సంహారకాలు ఉంటున్నాయి.

పెస్టిసైడ్స్‌ ఆనవాళ్లతో అనర్థాలివే..
దేశంలో సరాసరిన 10% మధుమేహ బాధి తులుండగా.. హైదరాబాద్‌లో సుమారు 16–20% మంది ఈ వ్యాధితో బాధపడుతు న్నారు. దేశంలో గ్రేటర్‌ సిటీ డయాబెటిక్‌ క్యాపిటల్‌గా మారుతుండటం ఆందోళన కలి గిస్తోంది. ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే క్రిమిసంహారకాలు ఆహారపదార్థాల ద్వారా మానవశరీరంలోకి ప్రవేశిస్తే సుమారు 20 ఏళ్ల పాటు అలాగే తిష్టవేసే ప్రమాదం ఉంద ని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల క్రిమిసంహారకాల అవశేషాలు దేహం లోని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయని.. పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణ మవుతాయంటున్నారు. కూరగాయలను ఉప్పు నీళ్లతో కడిగిన తరవాత.. బాగా ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

మధుమేహానికి కారకాలు..
తెలుగు రాష్ట్రాల్లో శరీర బరువు తక్కువగా ఉన్న వారు.. రక్తంలో కొవ్వు మోతాదు తక్కువ ఉన్న వారు సైతం మధు మేహ వ్యాధి బారిన పడేందుకు ఆర్గానో క్లోరిన్‌ తదితర క్రిమి సంహారక ఆనవాళ్లు ఆహార పదార్థాల్లో చేర డమే ప్రధాన కారణ మని ఈ నివేదిక హెచ్చరిం చింది. మరోవైపు ఆర్గానో క్లోరిన్‌ క్రిమిసం హారకాల తయారీ దేశంలో అధి కంగా జరుగుతోందని.. ఇక లిండేన్‌ వంటి నిషే ధిత క్రిమిసంహారకాన్ని సైతం దేశంలో పలు ప్రాం తాల్లో విరివిగా విని యోగిస్తుండటంతో పలు అనర్థాలు తలెత్తు తున్నా యని ఈ నివేదిక స్పష్టం చేసింది. తలసరి క్రిమిసం హారకాల వినియోగం లోనూ రెండు తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండటం గమనార్హం. తల్లిపాలలోనూ క్రిమి సంహారకాల ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు