బిడియపడే సందేహం... తీర్చుకునే మార్గం!

6 May, 2015 23:04 IST|Sakshi
బిడియపడే సందేహం... తీర్చుకునే మార్గం!

అడగటానికి బిడియపడే ప్రశ్నలెన్నో వుంటాయి. అలాంటి వాటికోసం నిపుణుల దగ్గరకు వెళ్లి సందేహాలు తీర్చుకోవాలన్నా ఒకింత బిడియం ఉంటుంది. మీకు ఆ అవస్థ తప్పించడం కోసమే ఈ వేదిక.
 
నా వయుసు 36. నా భార్య వయుస్సు 27. పెళ్లరుున ఏడాదికి బాబు పుట్టాడు. కొద్దికాలం పిల్లలు వద్దనుకొని ఐదేళ్లపాటు కండోమ్ వాడాము. ఈవుధ్య మరో బిడ్డ కోసం కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటున్నాం. అరుుతే నాకు వెంటనే వీర్యం పడిపోతోంది. నా భార్య ఇంకా సెక్స్ కావాలంటోంది. శీఘ్రస్ఖలనం వల్ల ఆమెను సంతృప్తిపరచలేకపోతున్నాను. నాకు సలహా ఇవ్వండి.
 - ఓ సోదరుడు, నిజామాబాద్

మీరు శీఘ్రస్ఖలనం (ప్రీ మెచ్యూర్ ఇజాక్యులేషన్) సమస్యతో బాధపడుతున్నారు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత సెక్స్ చేయడం అన్నది ఒక యూంత్రికమైన చర్యగా మారవచ్చు. అప్పుడీ సవుస్య రావడం చాలా సాధారణం. మీరు ఈ వయుస్సులో మీ శారీరక ఆరోగ్యం, దారుఢ్యం (ఫిజికల్ ఫిట్‌నెస్) కాపాడుకోవడం అవసరం. దాంతోపాటు బీపీ, షుగర్ వంటి సవుస్యలు లేకుండా చూసుకోవడంతో పాటు సామాజికంగా మీపై పడే ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం. ఇవన్నీ చేస్తూ మీ భార్య పట్లప్రేవూనురాగాలను పెంచుకొని సెక్స్‌లో పాల్గొనండి. దాంతో మీ పెర్‌ఫార్‌మెన్స్‌తో పాటు సెక్స్‌లో పాల్గొనే వ్యవధి తప్పక పెరుగుతుంది. ఈ జాగ్రత్తలతోనూ మీ పరిస్థితిలో వూర్పు రాకపోతే ఒకసారి ఆండ్రాలజిస్ట్‌ను కలిస్తే మీకు సరైన వుందులు సూచిస్తారు.

నా వయస్సు 65 ఏళ్లు. సెక్స్ తర్వాత నాకు చాలా తక్కువ వీర్యం వస్తోంది. చాలామంది డాక్టర్లను కలిసి మందులు వాడినా ప్రయోజనం లేదు. నా వీర్యం పరిమాణం పెరిగేందుకు మందులు తెలియజేయండి.
 - ఎన్.ఎస్.పి.ఆర్., ఖమ్మం

వయసు అరవై దాటాక వీర్యం తక్కువగా రావడం అనేది పెద్ద సమస్య కానే కాదు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వీర్యం ప్రధానంగా సంతానోత్పత్తికి మాత్రమే దోహదం చేస్తుంది. సెక్స్‌లో సంతృప్తికి వీర్యం పరిమాణం ఎంత అన్నది అంత ముఖ్యమైన అంశం కాదు. ఈ వయస్సులో హార్మోన్ల స్రావం తగ్గడం వల్ల వీర్యం పరిమాణం తగ్గవచ్చు. మీరు సెక్స్‌లో నార్మల్‌గా సంతృప్తి పొందుతూ ఉంటే వీర్యం పరిమాణం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి.

నాకు నెల రోజుల క్రితమే సిజేరియన్ ద్వారా ప్రసవం అయ్యింది. మావారు కోరికలను అణచుకోలేక సెక్స్ కోసం నన్ను బలవంతం చేస్తున్నారు. ప్రవసం అయిన ఎన్ని రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. సిజేరియన్ అయినందున ఆర్నెల్లలోపు సెక్స్‌లో పాల్గొంటే ప్రమాదమని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు నిజమేనా?

- ఓ సోదరి, విజయవాడ

 సిజేరియన్ ద్వారా ప్రసవం తర్వాత ఆ కుట్లు మానడానికీ, యోని కండరాలు మళ్లీ మామూలు దశకు రావడానికి కనీసం ఆరు వారాల వ్యవధి (అంటే నెలన్నర) పడుతుంది. ఈ ఆరువారాల తర్వాత యోని వద్ద ఎలాంటి నొప్పిగానీ లేదా రక్తప్రావం గానీ మరే సమస్యా లేకుండా ఉండి, మీరు కూడా శారీరకంగా, మానసికంగా సెక్స్‌కు సిద్ధంగా ఉంటే మీవారి కోరికను నిర్భయంగా మన్నించవచ్చు. అంతేగానీ... సిజేరియన్ అయినందున ఆర్నెల్ల పాటు సెక్స్‌కు దూరంగా ఉండాలన్నది కేవలం అపోహ మాత్రమే.

నా వయుస్సు 20 ఏళ్లు. గత ఆరేళ్లుగా హస్తప్రయోగం చేస్తున్నాను. రోజుకు చాలా సార్లు చేసేవాణ్ణి. గతంలో వీర్యస్ఖలనం అయ్యేందుకు చాలా సవుయుం పట్టేది. కానీ ఇటీవల చాలా త్వరగా వీర్యం పడిపోతోంది. అదీగాక నా అంగం చిన్నగా ఉంది. సైజ్ పెరగడానికి వూర్గం చెప్పండి. నా వృషణాలు కిందికీ  పైకీ జారుతూ, కదులుతూ ఉన్నారుు. ఇలా జారకుండా ఉండటానికి వూర్గం చెప్పండి. హస్తప్రయోగం వల్ల హైట్ పెరగదా? నేను పెళ్లయ్యాక నా భార్యను సుఖపెట్టగలనా?

- శ్రీనివాస్, కోదాడ

మీరు ఆరేళ్లుగా హస్తప్రయోగం చేస్తుండటం వల్ల మీరు ఈ ప్రక్రియను చాలా యాంత్రికంగా చేస్తుండవచ్చు. దాంతో మొదట్లో ఉన్న ఎక్సరుుట్‌మెంట్, థ్రిల్ కాస్త తగ్గి ఇలా త్వరగా వీర్యస్ఖలనం అరుుపోతోంది. మీరు పెళ్లి చేసుకుని భార్యతో సెక్స్‌లో పాల్గొంటే వుళ్లీ వూవుూలుగా మొదట్లోని థ్రిల్‌ను, ఎక్సరుుట్‌మెంట్‌ను, వుంచి తృప్తిని పొందగలుగుతారు.

కాబట్టి ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. ఎక్కువసార్లు హస్తప్రయోగం చేసినందువల్ల అంగం సైజ్ తగ్గడం అంటూ ఉండదు. సెక్స్‌లో తృప్తి చెందేందుకు లేదా భార్యను తృప్తిపరచేందుకు అంగస్తంభనలు చక్కగా ఉంటే చాలు. పురుషాంగం సైజ్‌కూ తృప్తికీ ఎలాంటి సంబంధం లేదు. మీకున్న అనుమానమే చాలావుందిలో ఉంటుంది. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. ఇక వృషణాలు పైకీ, కిందికీ కదలడం అన్నది సర్వసాధారణమైన ప్రక్రియు. ఇలా కావడాన్ని క్రిమేస్టరిక్ రిఫ్లెక్స్ అంటారు. వృషణాల సంరక్షణ కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు ఇది. హస్తప్రయోగానికీ ఎత్తుపెరగకపోవడానికీ ఎలాంటి సంబంధం లేదు. హస్తప్రయోగం వల్ల ఎలాంటి హానీ ఉండదు.

నాకు 55 సంవత్సరాలు. ఏడాది క్రితం ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్‌లార్జ్ అయ్యిందని టీయూఆర్‌పీ ఆపరేషన్ చేశారు. అప్పట్నుంచి అంగస్తంభనలు లేవు. ఈ ఆపరేషన్ వల్ల అంగస్తంభనలు తగ్గుతాయా? ముందు ముందు ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందా? పీఎస్‌ఏ పరీక్ష చేయించాలా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
 - కె. నాగేశ్వరరావు, గుంటూరు

టీయూఆర్‌పీ అంటే... ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. ఈ సర్జరీలో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా పెరిగిన ప్రోస్టేట్‌ను తీసివేసి మూత్రం రావడానికి గల అడ్డును తొలగిస్తారు. ఇది 50 ఏళ్లు పైబడ్డ వాళ్లలో సాధారణంగా చేసే ఆపరేషన్. ఈ సర్జరీకి అంగస్తంభనలకు సంబంధం లేదు. అంతకుమునుపు ఉన్న స్తంభనలే సర్జరీ తర్వాత కూడా ఉంటాయి.

కాకపోతే 50 ఏళ్ల పైబడ్డవారిలో సాధారణంగా కనిపించే బీపీ, షుగర్ వంటి వాటి వల్లనో లేదా ఇతరత్రా శారీరక దారుఢ్యం (ఫిజికల్ ఫిట్‌నెస్) లేకపోవడం వల్లనో మీకు స్తంభనలు తగ్గి ఉండవచ్చు. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వారు ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్‌ఏ) పరీక్ష రెండేళ్లకు ఓసారి చేయించడం మంచిది. టీయూఆర్‌పీ సర్జరీ తర్వాత కూడా పీఎస్‌ఏ పరీక్ష తరచూ చేయించాలి. ఈ పరీక్ష చేయించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోడానికి అవకాశం ఉంది.
 
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్,
కె.పి.హెచ్.బి, హైదరాబాద్
 
 

మరిన్ని వార్తలు