అవునా! క్లాత్‌తోనా!!

4 Feb, 2016 23:10 IST|Sakshi
అవునా! క్లాత్‌తోనా!!

వార్డ్‌రోబ్‌లో కొన్నాళ్లుగా వదిలేసిన డ్రెస్సులు, స్కార్ఫ్‌లు, దుపట్టాలు మొదలైనవి చెక్కుచెదరకుండా అలాగే పడి ఉంటాయి. లేదంటే డ్రెస్ కుట్టగా మిగిలిన అదనపు క్లాత్‌లు, గిఫ్ట్ ప్యాక్‌లకు వచ్చే రంగు రంగుల రిబ్బన్లు చెత్తబుట్టలోకి చేరుతుంటాయి. కొంచెం సృజన, మరికొంచెం ఆసక్తి జోడిస్తే ఖాళీ సమయంలో ఇలాంటి అందమైన ఆభరణాలను ఎన్నో రూపొందించుకోవచ్చు.
 
రిబ్బన్ మెటీరియల్‌తో గులాబీలుగా చుట్టి కుట్టాలి. వీటికి ముత్యాలు,  చీర  రంగుకు మ్యాచ్ అయ్యే పూసల  దండను జత చేర్చితే ఇలా అందమైన కంఠాభరణం సిద్ధం.రంగు రంగు క్లాత్‌ను తీసుకొని దానిని పొడవుగా కత్తిరించి, జడను అల్లిన విధంగా రెండు మూడు
 వరసలుగా అల్లాలి. ఒక వరుసకు ఉడెన్ బీడ్స్ జత చేస్తే ఆధునిక అమ్మాయిలు ఇష్టపడే నెక్ జూవెల్రీ రెడీ.
 
 పసుపు, నారింజ, పచ్చ కాటన్ క్లాత్‌లను చుట్టి, మధ్య మధ్య మరో దారంతో ముడులు వేయాలి. ఒక వరస జడలా క్లాత్‌తో అల్లాలి. వీటికి కలంకారీ బెల్ట్‌ను జతచేయాలి. మోడ్రన్ డ్రెస్‌ల మీదకు ఆకర్షణీయంగా ఉంటుంది. పట్టు, బెనారస్ చీరల అంచు లేదా జాకెట్టు కుట్టగా మిగిలిన ఫ్యాబ్రిక్‌తో ఈ అందమైన లాకెట్‌ను రూపొందించవచ్చు. ఇందుకు రెండు రంగుల ఫ్యాబ్రిక్, పెద్ద డ్రెస్ బటన్, పూసలు జత చేసి ఈ అందమైన లాకెట్‌ను రూపొందించవచ్చు.రంగుమారిన ప్లాస్టిక్, ఉడెన్ గాజులకు ఇలా రంగు దారాలతోనూ, బట్ట ముక్కలతో గ్లూతో అతికిస్తూ చుడితే నాజూకు  చేతులను ఆకర్షణీయంగా మార్చేస్తాయి.
 

మరిన్ని వార్తలు