నవ్వుతో నాజూకు దేహం

21 Jan, 2016 23:40 IST|Sakshi
నవ్వుతో నాజూకు దేహం

పరిపరి   శోధన

నవ్వు నాలుగు విధాల చేటు అనే సామెతకు ఏనాడో కాలం చెల్లింది. నవ్వు నలభై విధాల గ్రేటని జనాలు తెలుసుకున్నారు. నవ్వు వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండొచ్చని, శారీరకంగా చురుగ్గా ఉండొచ్చని కూడా పలు పరిశోధనలు తేల్చాయి. రోజులో ఎక్కువ సేపు నవ్వులు చిందిస్తూ ఉండటం వల్ల శరీరం నాజూకుతనాన్ని సంతరించుకుంటుందని ఇటీవల బ్రిటిష్ పరిశోధకులు తేల్చారు.

పెదవులు అరవిరిసేలా చిందించే చిరునవ్వుల కంటే, పగలబడి నవ్వే నవ్వుల వల్ల ముఖ కండరాలకు, పొట్ట కండరాలకు తగినంత వ్యాయామం లభించి, కేలరీలు కరుగుతాయని జీవశాస్త్రవేత్త కూడా అయిన బ్రిటిష్ హాస్యనటి డాక్టర్ హెలెన్ పిల్చర్ చెబుతున్నారు.
 

 

మరిన్ని వార్తలు