గుప్పెడు వేపాకులు

25 Nov, 2019 04:01 IST|Sakshi

బ్యూటిప్స్‌

►గుప్పెడు వేపాకులు శుభ్రంగా కడిగి, రెండు లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి వడకట్టి ఒక బాటిల్‌లో పోసి ఉంచాలి. స్నానం చేసే బకెట్‌ నీటిలో కప్పు వేపాకుల నీళ్లు కలపాలి. ఈ నీటితో రోజూ స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే  చర్మసంబంధమైన ఇన్ఫెక్షన్లు, యాక్నె వంటివి మెల్ల మెల్లగా తగ్గిపోతుంటాయి.

►గుప్పెడు వేపాకులను మెత్తగా నూరి రెండు కప్పుల నీటిలో కలిపి మరిగించాలి. ఒక కప్పు అయ్యేవరకు మరగనిచ్చి, చల్లారనివ్వాలి. ఈ నీళ్లలో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని వారానికి మూడుసార్లు ముఖానికి పట్టించి, చల్లటి నీళ్లతో కడిగేయాలి. వైట్‌ హెడ్స్, బ్లాక్‌ హెడ్స్, యాక్నె నుంచి విముక్తి లభిస్తుంది. పోర్స్‌లో మలినాలు శుభ్రపడతాయి. జిడ్డు చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్‌.

మరిన్ని వార్తలు