చలికాలం చర్మం పెళుసుబారకుండా రక్షించుకోండిలా!

3 Nov, 2023 09:31 IST|Sakshi

వేకువ జాముకు చలి తొంగిచూస్తోంది. కిటికీలో నుంచి దొంగలా గదిలో దూరుతోంది. చల్లగా ఒంటికి హాయినిస్తుంది. కానీ చర్మాన్ని పెళుసుబారుస్తుంది కూడా. అందుకే ఆలస్యంగా చర్మసంరక్షణ మొదలవ్వాలి.

  • రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత బాదం నూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ రాయాలి.  
  • గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇది హాట్‌థెరపీ. రోజుకొకసారి ఉదయం స్నానం చేయడానికి ముందు కానీ రాత్రి పడుకునే ముందుకానీ చేయవచ్చు. 
  • ఒక కోడిగుడ్డు సొనలో, టీ స్పూన్‌ కమలారసం, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది పొడిచర్మానికి వేయాల్సిన ప్యాక్‌. 

  • బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ నలుపు కూడా వదులుతుంది. 
  • పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌ బాగా పని చేస్తుంది. ఆయిల్‌ను ఒంటికి రాసి మర్దన చేయాలి. 
  • ఫేస్‌ప్యాక్‌లకు బదులుగా స్వచ్ఛమైన ఆముదం ఒంటికి రాసి మర్దన చేసుకోవాలి. ఆముదం వల్ల చర్మం మృదువుగా మారడంతోపాటు అనేక చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. 

(చదవండి: అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్‌!)

మరిన్ని వార్తలు