వేసవి తాపాన్ని హరించే పుచ్చకాయ!

15 May, 2017 23:31 IST|Sakshi
వేసవి తాపాన్ని హరించే పుచ్చకాయ!

గుడ్‌ఫుడ్‌

చలవ చేసే చాలా పండ్లు ఆస్తమాను ప్రేరేపిస్తాయనే అపోహ ఉంటుంది. అసలు ఆ అపోహ కూడా లేని పండు పుచ్చకాయ. పైగా దానివల్ల ఆస్తమా తగ్గుతుంది కూడా.క్రమం తప్పకుండా పుచ్చకాయ తినేవారిలో హైబీపీ నియంత్రణలో ఉంటుందనే అధ్యయన ఫలితం ఇటీవల‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ హైపర్‌టెన్షన్‌’లో ప్రచురితమైంది.పుచ్చకాయలోని విటమిన్‌–సి, యాంటీ ఆక్సిడెంట్స్‌ కారణంగా అది ఫ్రీరాడికల్స్‌ను అరికడుతుంది.

దాంతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ మొదలుకొని అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి బాగా ఉపకరిస్తుంది. ఈ పండులో 92% నీళ్లే కాబట్టి వేసవిలో కోల్పోయే నీళ్లను భర్తీ చేసి, డీ–హైడ్రేషన్‌ను నివారిస్తుంది.

 

మరిన్ని వార్తలు