ఎస్‌ఓఎస్ అంటే అర్థం ఏమిటి?

25 Oct, 2015 23:22 IST|Sakshi

మెడి క్షనరీ
 
డాక్టర్లు మందులు రాసినప్పుడు కొన్ని అవసరమైతేనే అని రాస్తుంటారు. అప్పుడు ఆ మందును ఎస్‌ఓఎస్ అని సూచిస్తుంటారు. ఎస్‌ఓఎస్ అంటే ఏమిటన్నది చాలా ఆసక్తికరం. వైద్యశాస్త్రంలోని చాలా పదాలు లాటిన్ భాషకు చెందినవే. అలాగే  ఎస్‌ఓఎస్ అనేది కూడా లాటిన్ పదబంధమే. ‘సి ఓపస్ సిట్’ అనే లాటిన్ మాటకు ఎస్‌ఓఎస్ అన్నది సంక్షిప్తరూపం.

‘సి ఓపస్ సిట్’ అంటే లాటిన్‌లో ‘అవరమైతేనే’ అని అర్థం. ఏదైనా మందును ‘అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి’ అని సూచించేందుకు ఎస్‌ఓఎస్ అనే మాటను వైద్యులు వాడుతుంటారు. లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే వాడాల్సిన మందులకు (ఉదాహరణకు నొప్పినివారణ మందుల వంటివి) డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌పై ఎస్‌ఓఎస్ అని రాస్తుంటారన్నమాట.
 

మరిన్ని వార్తలు