వెరైటీ డ్రెస్‌లకు కేరాఫ్

14 Oct, 2014 00:45 IST|Sakshi
వెరైటీ డ్రెస్‌లకు కేరాఫ్

బొటిక్, డిజైనర్ దుస్తులు అనగానే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అనుకోవడం సహజం. అయితే ఎకానమీ రేట్లలో, యూనిక్ దుస్తులు లభిస్తాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. అలా హిళల డిజైనర్ దుస్తులను రీజనబుల్ ధరల్లో అందరికీ అందుబాటులోనికి తేవాలనే ప్రయత్నాలు నగరంలోని డిజైనర్లు మొదలుపెట్టారు. వినూత్న బ్రైడల్ ప్యాకేజీలు, కుర్తాలు, డిజైనర్ చీరలు, బ్లౌజ్‌లు, గాగ్రాలు, అనార్కలీలతో పాటు వర్కింగ్ వుమెన్ కోసం ప్రత్యేక వెరైటీలు రూపొందిస్తున్నారు. రోజువారీ నుంచి పెళ్లి దుస్తుల వరకు అన్నింటినీ అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వెరసి వెరైటీ డ్రెస్‌లకు కేరాఫ్ అడ్రెస్‌గా నగరం నిలుస్తోంది.  
 
వధువు పెళ్లి బట్టలతో పాటు వధువు కుటుంబ సభ్యుల దుస్తుల బాధ్యత అంతా ఒక ప్యాకెజ్‌లా అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్యాకేజ్‌లో వధువు తల్లితండ్రులు, తోబుట్టువులు ఇలా సభ్యుల సంఖ్య, అలాగే వారు ఎంచుకునే దుస్తుల డిజైన్లను బట్టి ప్యాకేజీలు ఉంటారుు.
 
స్పెషల్ బ్లౌజెస్...

డిజిటల్ ప్రింట్ ఉన్న మెటీరియల్‌తో స్టిచ్ చేసిన చూడీ స్లీవ్స్ బ్లౌజ్. చక్కటి కట్స్, ఫిట్టింగ్‌తో నేటి యువతను ఆకట్టుకునే ఈ ట్రెండీ బ్లౌజ్‌ని ప్లెరుున్ చీరలతోనే కాకుండా రకరకాల చీరలపై మ్యాచ్ చేసుకోవచ్చు.

సింపుల్ వర్క్ చేసిన గ్రే కలర్ శారీకి హైనెక్‌తో వున్న రెడ్ కలర్ బ్లౌజ్ హైలెట్‌గా కనిపిస్తుంది. కట్‌దానా మెటీరియల్‌పై పూర్తిగా హ్యాండ్ వర్క్ చేసిన ఈ బ్లౌజ్‌ని పలు రకాల చీరలకే కాదు గాగ్రాలకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు.
 
ఎల్లో పసువు రంగులతో డై చేసిన చక్కటి నిట్ వర్క్ బ్లౌజ్. పర్‌ఫెక్ట్ ఫిట్టింగ్, ఫినిషింగ్ వున్న లేటెస్ట్ ట్రెండ్ బ్లౌజ్‌ని ఇలా హాఫ్ శారీలకు మాత్రమే కాక చీరలకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు.
 
డిజైనర్ చీరలు...
 
బ్లౌజ్‌లు, కుర్తాలు, డ్రెస్సులతో పాటు డిజైనర్ చీరలు రూపొందిస్తున్నారు. కోటా మెటీరియల్‌ని ఆరెంజ్, బ్లూ రంగులతో డై చేసి అందమైన చీరలుగా వులుస్తున్నారు. కట్‌వర్క్ చేసిన చీర అంచులకు కుందన్, ముత్యాలను చేతితో కుట్టి చూడచక్కగా తయూరు చేస్తున్నారు.

కలంకారీ వర్క్‌ని ఎక్కువగా లేటెస్ట్ దుస్తుల డిజైన్‌లలో వాడుతున్నారు. సహజమైన రంగులతో చేసే ఈ వర్క్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

తెలుగువారి కోసం, తెలుగు వారికి నచ్చే దుస్తుల రూపకల్పన చేస్తుంటాం. ఏ ప్రాంతం వారికైనా వారి ప్రాంతం, వారి ఇష్టాఇష్టాలు బాగా తెలుస్తాయి. అలా నేటివిటీ, టేస్ట్‌తో పాటు వచ్చిన కస్టమర్ అభిరుచి, రూపురేఖలకు అనుగుణంగా దుస్తులు తయారు చేస్తాం. అలాగే మా సర్వీసులు ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో వున్నాయి. విదేశాల్లో, ఇతర నగరాల్లో వున్న వనితల అవసరాలకు తగిన విధంగా దుస్తులు రెడీ చేసి ఇస్తుంటాం.

- లతాశ్రీ, లాష్ స్టూడియో

మరిన్ని వార్తలు