ఫ్యాషన్ సూత్ర..

13 Oct, 2014 00:27 IST|Sakshi
ఫ్యాషన్ సూత్ర..

అడుగుల్లో తడబాటు... మాటల్లో తత్తరపాటు... చూపుల్లో నునుసిగ్గులు... చెంపల్లో కెంపులు... ఇవన్నీ కలగలిసి కదలివచ్చే నవవధువు సొగసు చూడతరమా... సంప్రదాయం ఏదైతేనేం... అందం, అలంకారం ఆమెదే. పెళ్లి వేడుకలో అప్పటిదాకా ముచ్చట్లలో మునిగిపోయి ఉన్న అతిథులంతా అటెన్షన్‌లోకి వచ్చారంటే దాని అర్థం పెళ్లికూతురి ఆగమనమే. అందుకే అన్ని రకాల సంప్రదాయాల్లోనూ నవవధువు అలంకారానికి అంత ప్రాధాన్యత. ముఖ్యంగా క్రైస్తవుల వివాహ వేడుకల్లో అయితే టాక్ ఆఫ్ ది ఈవెంట్  వధువు ధరించే వెడ్డింగ్ గౌన్.
 
పెళ్లి వేడుకల్లో ఒక్కో సంప్రదాయూనిది ఒక్కో విలక్షణత. ఏ సంప్రదాయుంలోనైనా పెళ్లిళ్లలో వధువు అలంకరణే కీలకం. నిజానికి నిశ్చితార్థం నాటి నుంచే పెళ్లి ఏర్పాట్లు మొదలవుతారుు. ఎప్పటికీ నిలిచిపోయే తీపి జ్ఞాపకంగా పెళ్లి వేడుకను వులచుకునేందుకు అందరూ తవు తవు సృజనాత్మకత మేరకు, వనరుల మేరకు తాపత్రయుపడతారు. అదే విధంగా క్రైస్తవుల పెళ్లిళ్లలో వధువు అలంకరణను అత్యంత కీలకంగా భావిస్తారు.

క్రైస్తవుల పెళ్లి ఏర్పాట్లు సాధారణంగా పెళ్లి తేదీకి దాదాపు వుూడు నెలల వుుందుగానే మొదలవుతారుు. పెళ్లి, రిసెప్షన్‌లకు వేదికల ఎంపిక, ఆహ్వాన పత్రికల ఎంపిక, వుుద్రణ, తోటి పెళ్లికూతురి ఎంపిక, ఆభరణాలు, అలంకరణ సావుగ్రి, ఇతర యూక్సెసరీస్ కొనుగోలు వంటివన్నీ ఒక పద్ధతి ప్రకారం చకచకా సాగిపోతారుు. వీటన్నింటి హడావుడి ఒకెత్తయితే... వధువు ధరించే ఆభరణాలతో పాటు పెళ్లి రోజున వధువు ధరించే వెడ్డింగ్ గౌన్ ఒక్కటీ ఒకెత్తు. అందుకే దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి అందించేందుకు సిటీలో పలు బొటిక్‌లు సిద్ధంగా ఉన్నాయి.
 
వెడ్డింగ్ వస్త్ర...
క్రైస్తవుల పెళ్లిళ్లలో వధువులు సాధారణంగా స్వచ్ఛతకు సంకేతంగా తెలుపు రంగు గౌన్ ధరిస్తారు. నగరంలో ఈ వైట్ గౌన్స్‌ని  రెడీమేడ్‌గా విక్రరుుంచే దుకాణాలు ఉన్నారుు. ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ లెక్కలేనన్ని డిజైన్లలో వెడ్డింగ్ గౌన్లు  దొరుకుతున్నారుు. గౌన్ల ధరలు చాలా వరకూ విభిన్న వర్గాలకు అందుబాటులోనే ఉంటున్నాయి. అయినా అదీ భరించలేని వారికి  వెడ్డింగ్ డ్రెస్‌ను అద్దెకు ఇచ్చే షాపులూ ఉన్నారుు. అవేవీ నప్పవనుకుంటే, వుుందుగానే నిపుణులైన టైలర్ల వద్ద ప్రత్యేకంగా కుట్టించుకోవచ్చు.

పెళ్లిలో తనకు తోడుగా ఉన్న తోటి పెళ్లికూతుళ్లకు కూడా వస్త్రాభరణాలను పెళ్లికూతురు కానుకగా ఇవ్వడం ఆనవారుుతీ. ఇందుకోసం కూడా వుుందుగానే వస్త్రాలను, ఆభరణాలను, ఇతర అలంకరణ సావుగ్రిని కొనుగోలు చేస్తారు. వెడ్డింగ్ గౌన్, చేతులకు గ్లౌస్, బొకే, ఇతర ఆభరణాలకు తోడుగా పెళ్లి రోజున వధువు వుుఖాన్ని పలచగా కప్పి ఉంచే మేలివుుసుగును ధరిస్తుంది. దీంతో పెళ్లి అలంకరణ పూర్తరుునట్లే.
 
ఫ్యాషన్ సూత్ర..
పెళ్లికి ఎలాంటి గౌన్ ధరించాలనేది వుుందుగానే నిర్ణరుుంచుకోవాలి. బాల్ గౌన్, స్లింకీ నంబర్, ఏ-లైన్, ఫిష్ టెరుుల్ వంటి వెరైటీలు అందుబాటులో ఉన్నారుు. వీటన్నింటినీ ఓసారి ట్రై చేసి, తవు శరీరాకృతికి బాగా నప్పేది ఖరారు చేసుకోవాలి. భారత్‌లో ఎక్కువ వుందిది కాస్త డార్క్ కాంప్లెక్షన్. మేనివన్నెకు తగిన రంగులో వెడ్డింగ్ గౌన్ ఎంపిక చేసుకుంటే గ్రాండ్‌గా కనిపిస్తారు. తెలుపులోనే చిన్నచిన్న తేడాలతో ఐవరీ, క్రీమ్‌కలర్, స్నోవైట్ వంటి రంగుల్లో వెడ్డింగ్ గౌన్లు దొరుకుతున్నారుు.

గోల్డ్, సిల్వర్ యూక్ససరీస్ వీటికి బాగా సూటవుతారుు. వీటికి అనుగుణంగానే అంబర్, పీచ్, రస్ట్, బ్రిక్ రెడ్, వార్మ్‌గ్రీన్, కేమెల్ వంటి రంగుల్లో కలర్‌థీమ్స్ ఎంచుకోవచ్చు. పెళ్లి సవుయుంలో వధువు చేత ధరించే బొకేలో సాధారణంగా తెలుపురంగు గులాబీలు లేదా ఆర్కిడ్స్ వాడతారు. గౌనుకు నప్పే బొకే ఎంపిక చేసుకుంటే, పెళ్లి వుండపంలో నవవధువు దేవకన్యలా మెరిసిపోతుంది.

- నీతా సంజయ్‘జాస్పర్ బ్రైడల్ కలెక్షన్’ స్టోర్

>
మరిన్ని వార్తలు