అందాల కనువిందుకు కత్తి ఎందుకు?

18 Oct, 2014 00:41 IST|Sakshi
అందాల కనువిందుకు కత్తి ఎందుకు?

(నాన్-సర్జికల్): ఆకర్షణీయంగా కనిపించాలనుకోవడం మానవ సహజం. కానీ అధిక కొవ్వు కారణంగా శరీర ఆకారం వికారంగా తయారవుతుంది. స్థూలకాయం ఒక శాపంగా పరిణమిస్తుంది. బరువును తగ్గించే ప్రక్రియల్లో లైపోసక్షన్ ప్రధానమైనది.దానికి సమానమైన ప్రభావాన్ని చూపిస్తున్నది శస్త్రచికిత్సేతర (నాన్-సర్జికల్) లైపోసక్షన్ విధానం. ఈ విధానం అత్యంత విప్లవాత్మక బాడీ మోడలింగ్ టెక్నిక్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు నిపుణులు. శస్త్రచికిత్సకు సంబంధించి భయాందోళనలున్నవారికి ఈ విధానం వల్ల ఎంతో మేలు.  దీనిలో మత్తుమందు (అనస్థీషియా) ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ విధానం ఎంతో సురక్షితమైనది. సైడ్ ఎఫెక్ట్‌లు ఏమీ ఉండవు. ఖర్చు కూడా చాలా తక్కువ. చికిత్స అనంతరం తిరిగి బరువు పెరగకపోవడం దీని ప్రత్యేకత. శరీరంలో కొవ్వును తగ్గించే ప్రక్రియ చికిత్స పూర్తి అయిన అనంతరం కూడా ఒక వారంపాటు కొనసాగుతుంది. ప్రప్రథమంగా 2005వ సంవత్సరంలో యూరప్‌లో అభివృద్ధి చెందిన ఈ విధానం, యుఎస్‌ఏలో కూడా ప్రాచుర్యం పొందింది. రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని హెల్దీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ద్వారా మనకు పరిచయమైంది.
 
 శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాల నుండి 40-60 శాతం కొవ్వును తగ్గించుకోవటానికి కేవలం 4-6 సందర్శనలు అవసరం.  చాలా తక్కువ మొత్తంలో ఖర్చయ్యే ఈ చికిత్సను పొందేందుకు యు.ఎస్., యు.కె., యు.ఎ.ఇ.ల నుండి కూడా స్థూలకాయ సమస్య పీడితులు ఈ క్లినిక్‌ను సందర్శిస్తున్నారు. అధిక బరువును తగ్గించుకోవటానికి, ఆత్మవిశ్వాస్వాన్ని పెంచుకోవటానికీ నాన్-సర్జికల్ లైపోసక్షన్ ప్రక్రియను అందిస్తున్నది హెల్తీ కర్వ్స్ స్లిమ్మింగ్ క్లినిక్.
 
 చర్మం సక్రమ నిర్వహణ అనేది మన అంతర్గత ఆరోగ్యం, బయటకు కనిపించే ఆకృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి. జీవితంలో దీని అవసరం మరింతగా పెరిగే దశలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు గర్భం ధరించి ఉన్న కాలంలోనూ, ఇతరత్రా కొన్ని కారణాల వల్ల ముఖం కుంగిపోయినట్లుగా కనిపిస్తుంది. కాన్పు అనంతరం, అసాధారణ ప్రాంతంలో చర్మం కుంగిపోవటం, బరువు తగ్గటం, ముఖంపై చర్మ కళను కోల్పోవటం తీవ్రమైన కాస్మెటిక్ సమస్యలకు దారితీస్తుంది. దీంతో వ్యక్తులు తమ వయస్సు కంటే పెద్దవాళ్ళుగా కనిపిస్తారు,‘‘అబ్లేటివ్ లేజర్ స్క్రిన్ రీసర్ఫేసింగ్’’ అనే ప్రక్రియ ద్వారా ముఖ సౌందర్యాన్ని తిరిగి తీసుకురావచ్చు. దీని కారణంగా సంక్రమించే ఇబ్బందులు, చర్మం రకాన్ని బట్టి ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ఈ చికిత్సను పొందటానికి రోగులు సందేహించవచ్చు. ఈ మధ్యనే ‘‘మల్టీ పోలార్ టెక్నాలజీ’’గా పిలువబడే ఒక వైవిధ్యమైన విధానం అభివృద్ధి చేయబడినది.
 
 ఇందులో అన్ని రకాల చర్మాలకు చికిత్సను అందించే నిమిత్తం రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్.ఎఫ్.) ఎనర్జీస్‌ను ఉపయోగిస్తుంటారు. కొన్ని క్లినిక్‌లలో ఉపయోగించే మోనోపోలార్, బైపోలార్ విధానాల కంటే ప్రభావవంతమైనది. అన్నిరకాల చర్మాలకు, సరియైన ఆకృతిని కలిగించేందుకు, చర్మంపై ముడతలు లేకుండా బిగుతుగా చేసేందుకు మల్టీపొలార్ సాధనాన్ని చక్కగా, సురక్షితంగాను ఉపయోగించవచ్చు. ముఖంపై ముడతలను పోగొట్టటానికి ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. ‘‘ప్రత్యేకమైన సదుపాయాలు, సాంకేతిక త మా సొంతం. దీని ఫలితాలు చాలా సానుకూలమైనవి. త్వరితగతిన ఏర్పడతాయి. అంతే కాకుండా, మా వైద్యుల బృందం వ్యక్తి సంక్షేమంపట్ల అంకితభావాన్ని కలిగి ఉంటారు.  వ్యక్తికి, రోగ లక్షణాలకు సంబంధించిన ప్రతి అంశంపట్ల ఖచ్చితమైన రీతిలో దృష్టి పెడతాం.’’ అని అంటున్నారు లైపోసక్షన్ ప్రక్రియలో ఐదేళ్లకుపైబడిన అనుభవమున్న డాక్టర్ కిషోర్.
 
 అనేక చర్మసంబంధ రుగ్మతలు, ముఖ సౌందర్యం పెంపొందించడానికి విభిన్నమైన చికిత్సావిధానాలకు హైదరాబాద్‌లోని ‘‘హెల్దీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్  కాస్మెటిక్ క్లినిక్ పేరుగాంచినది. ఈ విధానాన్ని ఉపయోగించటంలో ప్రత్యేకత కలిగింది. మీ చర్మ సంబంధిత సమస్యల నుండి పూర్తి మార్పు, ఉపశమనం కొరకు మమ్ములను సంప్రదించండి.

మరిన్ని వార్తలు