చంద్రబింబం: మార్చి 9 నుండి 15 వరకు

9 Mar, 2014 01:34 IST|Sakshi
చంద్రబింబం: మార్చి 9 నుండి 15 వరకు

 మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. ఆరోగ్యపరమైన చికాకులు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.  వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి నిరుత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగయోగం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. ఆస్తి ఒప్పందాలు వాయిదా. ఉద్యోగులకు అనుకోని మార్పులు సంభవం. విద్యార్థులకు కొంత నిరాశ. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.  నిరుద్యోగులకు ఉద్యోగయోగం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం, విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యభంగం. రాజకీయరంగం వారికి నిరాశాజనకంగా ఉంటుంది. పాతబాకీలు వసూలవుతాయి.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికరంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. బంధువులతో తగాదాలు.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 స్థిరాస్తి వృద్ధి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 పనులు సకాలంలో పూర్తి. శ్రమ ఫలించే సమయం. ఒక వ్యవహారంలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరం. పారిశ్రామికరంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకం. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. లాభాలు స్వల్పం. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. రాజకీయరంగం వారికి నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. వారం చివరిలో ధన, వస్తులాభాలు. వాహనయోగం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)

 బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కళారంగం వారు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. వారం ప్రారంభంలో శుభవార్తలు. సోదరుల నుంచి ధనలాభం.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.చిరకాల కోరిక  నెరవేరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.  కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 పనులలో జాప్యం. బంధువులు, మిత్రులతో వైరం. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. సోదరుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యం. రాజకీయరంగం వారికి చికాకులు. వారం చివరిలో ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు.
 
 -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
 
 

మరిన్ని వార్తలు