‘కొత్త రైనాను చూస్తారు’ | Sakshi
Sakshi News home page

‘కొత్త రైనాను చూస్తారు’

Published Sun, Mar 9 2014 1:30 AM

‘కొత్త రైనాను చూస్తారు’

టి20 ప్రపంచకప్‌లో సత్తా చాటుతా
 మళ్లీ వన్డే జట్టులోకి వస్తా: సురేశ్ రైనా
 
 చెన్నై: పేలవ ఫామ్ కారణంగా భారత వన్డే జట్టులో చోటు కోల్పోయి, ఆసియా కప్‌కు దూరమైన సురేశ్ రైనా.. టి20 ప్రపంచకప్‌లో సత్తా చాటి మళ్లీ వన్డేల్లోకి వస్తానంటున్నాడు. దేశవాళీ వన్డేలు ఆడుతూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించినట్లు చెప్పాడు. గత మ్యాచ్‌ల్లో 20, 30 పరుగులు సాధించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యానని... ఈ విషయంలో మాజీ కెప్టెన్ గంగూలీ నుంచి సలహాలు తీసుకుని ఆత్మవిశ్వాసం పెంచుకున్నానని చెప్పాడు. ‘ఇంతకుముందు నా ఆటతీరు ఎలా ఉండేదో సౌరవ్ గుర్తుచేశాడు.
 
  నా సహజశైలిలో దూకుడుగానే ఆడాల్సిందిగా సూచించిన అతని మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి’ అని రైనా అన్నాడు. షార్ట్ పిచ్ బంతుల్ని ఎదుర్కోవడంపైనా ప్రత్యేకంగా సాధన చేశానని, రానున్న టి20 ప్రపంచకప్‌లో భిన్నమైన రైనాను చూస్తారని వ్యాఖ్యానించాడు. టి20 ఫార్మాట్‌లో తొందరగా క్రీజులోకి వస్తుండటంతో ఇన్నింగ్స్‌ను నిర్మించుకునే అవకాశం లభిస్తోందని, మళ్లీ జట్టులో చోటు దక్కితే వన్డేల్లోనూ అదే తరహాలో ఆడతానన్నాడు. టి20 ప్రపంచకప్, ఐపీఎల్‌లలో రాణించడం ద్వారా వన్డేల్లో స్థానం సంపాదిస్తాననే విశ్వాసం ఉందన్నాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement