హెల్త్‌కార్నర్

11 Sep, 2016 00:34 IST|Sakshi

* జీర్ణశక్తిని మెరుగుపరచడానికి పుదీనా కూడా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా రసం తరచు తీసుకుంటున్నట్లయితే, జీర్ణకోశ సమస్యలు చాలావరకు నయమవుతాయి. అలాగే, పుదీనా నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది.
 
* ఆకలి మందగించడం, భోజనం తర్వాత వికారం వంటి సమస్యలకు దాల్చినచెక్క చక్కని ఔషధంగా పనిచేస్తుంది. చెంచాడు దాల్చినచెక్క పొడిని గ్లాసు నీళ్లలో వేసి కషాయంగా కాచుకుని, చల్లారిన తర్వాత తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు, దాల్చినచెక్క రక్తంలో చక్కెరస్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది.
 
* జీలకర్రను నీళ్లలో వేసి, కషాయంగా చేసుకుని తాగితే కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణసంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీలకర్రలో పుష్కలంగా ఉండే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అకాల వార్ధక్యాన్ని నివారిస్తాయి.
 
* గర్భిణులకు తలెత్తే వేవిళ్ల సమస్యకు అల్లం బాగా ఉపయోగపడుతుంది.  చిన్న అల్లం ముక్కను దంచుకుని, అందులో చిటికెడు ఉప్పు కలుపుకొని బుగ్గన వేసుకుని చప్పరిస్తూ ఉంటే అజీర్తితో పాటు వివిధ కారణాల వల్ల తలెత్తే వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
 
* వెల్లుల్లి జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. రోజూ కనీసం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటున్నట్లయితే, జీర్ణప్రక్రియతో పాటు జీవక్రియలు కూడా మెరుగుపడతాయి. శరీరంలో అదనంగా కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
 
* జ్వరం పడి లేచాక చాలామందికి నోరు అరుచిగా అనిపించడం, ఆకలి మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మిరియాలు ఈ సమస్యలకు విరుగుడుగా పనిచేస్తాయి. మిరియాల కషాయం తాగితే నోటికి రుచి పెరగడమే కాకుండా, ఆకలి కూడా పుడుతుంది.

మరిన్ని వార్తలు