చెంచాతుర్యం... దాని మహత్యం!

4 Sep, 2016 00:26 IST|Sakshi
చెంచాతుర్యం... దాని మహత్యం!

హ్యూమర్
‘‘ఒరేయ్... చెంచాను కాస్త చిన్న చూపు చూశారేమోనని అనిపిస్తోంది రా’’ అన్నాడు మా రాంబాబు గాడు స్పూన్‌తో అన్నం ప్లేట్‌లో కూర పెట్టుకుంటూ.
 ‘‘చెంచాకు చిన్నచూపు ఏమిట్రా?’’ అడిగాను నేను అయోమయంగా.
 ‘‘చెంచాగాడు అనే మాట విన్నావా?’’ అడిగాడు వాడు.
 ‘‘విన్నాను’’ జవాబిచ్చాను.
 ‘‘మరి... ఆ మాట తప్పుకదా. నమ్మకమైన సహచరుడినీ, ఎప్పుడూ వెంట వెంట ఉండే అనుచరుణ్ణీ అలా చెంచాతో పోల్చి చెంచాగాడు అని కించపరచడం సరికాదు కదా’’ అన్నాడు వాడు.
 దాంతో రాంబాబుగాడు చెప్పే మాట కూడా లాజికల్‌గా కరక్టే కదా అనిపించి ‘‘అవును రా’’ అన్నాను.
 
‘‘అంతేకాదు రా... పాశ్చాత్యులు ఏదో స్పూన్ పట్టుకు తింటుంటారనీ, మనం స్పూన్‌తో తినం అనీ అంటుంటారు గానీ... నిజానికి స్పూన్ కనిపెట్టింది కూడా మనమేరా. విదేశీయులు మన స్పూన్‌ను కిడ్నాప్ చేశారు’’ అన్నాడు వాడు.
 ‘‘అదేమిట్రా. మనం చేత్తోనే కదా తింటాం. వాళ్లే కదా చెంచాను మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇదెలా నిజం?’’ అడిగాను.
 ‘‘ఒరేయ్... ఉగ్గుపాలతో పెట్టిన విద్య అనే సామెత విన్నావ్ కదా. అంటే మనవాళ్లు పాలు పట్టడానికి ప్రత్యామ్నాయంగా ఉగ్గు కనిపెట్టారు. అలాంటప్పుడు చెంచాను మనం కనిపెట్టినట్టే కదా’’
 
‘‘చెంచాకూ, ఉగ్గుకూ సంబంధం ఏమిట్రా?’’ అడిగా.
 ‘‘ఎందుకు లేదూ... చిన్న ఉగ్గుగిన్నెకు కాస్త పొడవైన కాడ పెట్టామనకో. అది స్పూనే అవుతుంది. అలా మనం కనిపెట్టిన చెంచాను పాశ్చాత్యులు కొట్టేసి, దానికి పేటెంట్ పట్టేశారు. ఉగ్గుపాలు పట్టడం అనే మాటను స్పూన్ ఫీడింగ్ అని వాళ్లు ట్రాన్స్‌లేటింగ్ చేసుకున్నారు. అంతేకాదు. నీలాంటి అమాయకుల చేత దాన్ని తామే కనిపెట్టినట్లుగా అనిపిస్తున్నారు. చూశావా... వాళ్ల అతితెలివితేటలూ!’’ అన్నాడు వాడు.
 
‘‘నిజమేరా. నువ్వు చెప్పాక తెలుస్తోంది’’ అన్నాను నేను.
 ‘‘ఆ... కరక్టే కదా. గంటె, గరిటె, చిల్లు గంటె, జల్లిగంటే అనే పెద్ద పెద్ద వాటికే మన వంట ప్రక్రియలో స్థానం ఉన్నప్పుడు... స్పూన్‌ను వాళ్లు కనిపెట్టడానికి ఆస్కారమే లేదు కదా. పైగా పాయసంలో గరిటలా పాడు బతుకు వద్దు అనే సామెత మనకు ఎప్పుడో ఉంది. ఎన్నో రకాల గరిటెలూ, గంటెలూ మన దగ్గర ఉన్నప్పుడు స్పూన్‌ను వాళ్లు కనిపెట్టి, దాన్ని మన దగ్గరకు వాడకంలో తెచ్చి ఉద్ధరించారనడానికి ఆస్కారమే లేదు. మనం ఈ విషయం కనిపెడతామేమోనని, అది వాళ్లదేనని చెప్పడానికి ఇంగ్లిష్‌లో కొన్ని సామెతలు కూడా సృష్టించే కుట్ర చేశారు’’ అన్నాడు వాడు.
 
‘‘ఏమిటా కుట్ర?’’ అడిగా.
 ‘‘నోట్లో వెండి చెంచాతో పుట్టడం అన్న సామెత ఇంగ్లిష్‌లోనే ఉందనీ, దాన్ని మన వారు కాపీ కొట్టారనీ భ్రమింపజేశాడు ఇంగ్లిష్ వాడు’’ అన్నాడు వాడు కోపంగా.
 ‘‘నిజమేరోయ్’’ అన్నాను.
 ‘‘అసలు... చెంచా అన్నమాట ఎలా పుట్టిందో తెల్సా నీకు?’’ అడిగాడు.
 ‘‘తెలియదు రా’’
 ‘‘నోట్లో చెంచా పెట్టుకొని అందులో గోలీ పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఆడే ఆట చూశావు కదా. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ గోలీ కిందపడిపోతుంది. అది ‘చంచలమైనది’ అంటూ చెబుతూ ముందు రెండక్షరాలనూ తీసుకొని చెంచా అనే మాటను సృష్టించారురా మన తెలుగువాళ్లు. అలా చెంచా అనే మాట పుట్టిందన్నమాట.

అంతేకాదు... పొడవు, బరువు, టైమ్‌లకు ఫిజిక్స్‌లో లెంగ్త్, మాస్, టైమ్ అనే ప్రధానమైన డైమన్షన్లు ఉన్నట్లే స్పూన్‌కు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాల్రా! ఈ విషయం చెంచా అనే కొలతకు తగిన స్థానం కలిగించమంటూ వరల్డ్ ఫిజిక్స్ అసోసియేషన్ వారికీ, సైంటిస్టులకూ ఓ విజ్ఞాపన ఇద్దామని అనుకుంటున్నా’’ అన్నాడు వాడు.
 ‘‘అదెలా... లెంగ్త్, మాస్, టైమ్... ఈ మూడే కదా ప్రధానమైన అంశాలు. చెంచాకూ వాటికీ సంబంధం ఏముంది’’ అడిగా.
 ‘‘ఎందుకు లేదూ... పొడవు, పదార్థమూ, సమయాలలాగే చెంచా కూడా ప్రత్యేకమైన కొలతే! అందుకే ఫలానా మందు ఎంత తీసుకోవాలి అని అడిగితే ఒక టీ స్పూను తీసుకోవాలంటారు. అలాగే వంటలో ఫలానా దినుసు ఎంత వాడాలంటే ఒక టేబుల్ స్పూన్ అంటారు. మరి అలాంటప్పుడు అది కూడా ఒక యూనిట్టే కదా. ఆలోచించు’’ అన్నాడు వాడు.
 ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘‘సరే రా. నువ్వు లెటర్ రాయి. దానికి అవసరమైన స్టాంపులు నేను అంటిస్తాను’’ అన్నాను వాడితో.
 ‘‘నువ్వురా నాకు అసలు సిసలైన చెంచాగాడివి’’ అంటూ ప్రశంసించాడు వాడు.
 - యాసీన్

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’