నా కవిత్వం ఒక్క రూపాయికి అమ్మేశారా!!

9 Dec, 2018 01:06 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

‘‘బాబాయ్‌... బాబాయ్‌’’ అని అరుచుకుంటూ అతడి వెనకాల పరుగెత్తుకుంటూ వస్తున్నాడు అబ్బాయ్‌. ఆయన కళ్లు పీక్కుపోయి ఉన్నాయి. దుస్తులు దుమ్ముకొట్టుకుపోయాయి. ఎన్ని రోజులవుతుందో తిండి తిని! ‘‘నాయనా వేణూ..’’ అంటూ పరుగెత్తుకు వచ్చింది అమ్మ. ఆమె కళ్లలో శోకనది కట్టలు తెంచుకుంది... ‘‘బాబూ వేణూ... ఏమిట్రా ఇది! ఇన్నాళ్లు ఎక్కడికెళ్లావు? ఏమైపోయావు? ఇల్లు వదిలి పెట్టి  ఎన్నాళ్లు ఇలా తిరుగుతావు?’’ ‘‘ఇల్లు వదిలి పెట్టినందుకు కాదమ్మా....తల్లిని  వదిలి పెట్టినందుకు బాధ’’ కన్నీళ్లను దిగమింగుతూ అన్నాడు వేణు. ‘‘ఆ బాధ నీకేమాత్రం ఉన్నా ఒక్కసారి వచ్చి కనబడక పోతావా’’ కొడుకు కళ్లలోకి చూస్తూ అడిగింది తల్లి. ‘‘ఏ ముఖం పెట్టుకొని కనబడమంటావు అమ్మా! చేయడానికి ఉద్యోగం లేదు. చేతిలో చిల్లి గవ్వలేదు’’ శూన్యంలోకి చూస్తూ అన్నాడు వేణు. ‘‘తల్లికి కావల్సింది నీ సంపాదన కాదురా. నీ క్షేమం. సరేలే... పద ఇంటికి పోదాం’’ అని కొడుకు చేయి పట్టుకుంది తల్లి. ‘‘ఇంటికా!’’ ఒక్క క్షణం వెనకడుగు వేశాడు వేణు. ‘‘అన్నం తిని ఎన్నాళ్లయిందో’’ కొడుకు కడుపు వైపు చూస్తూ అన్నది అమ్మ. అందుకే అంటారు కదా... అమ్మ జేబు చూడదు... కాలే కడుపు చూస్తుందని! తన ఆకలిని అబద్ధంతో కప్పిపెట్టాలనుకొని... ‘‘నేను బాగానే తింటున్నానమ్మా’’ అన్నాడు\వేణు. ‘‘ఆ ముఖం చూస్తూనే తెలుస్తుందిరా... పదపదా’’ అని బలవంతంగా కొడుకును ఇంటికి తీసుకెళ్లింది అమ్మ. ఇంట్లో... ‘‘బాబూ! నీకు అర్షలు అంటే ఇష్టంగా. అన్నం  ఉడికేలోపు ఇవి తిను’’అమ్మ చేతుల్లో నుంచి అర్షలు తీసుకొని తినబొయ్యాడో లేదో... లోపలి నుంచి అన్నల వెటకారాలు మొదలయ్యాయి... ‘‘తమ్ముడూ వేణు! అర్షలు తింటున్నావా! తిను. బాగా తిను. అర్షలతో పాటు అమ్మ ప్రేమ కూడా బాగా తినమ్మా. ఒరేయ్‌ ధనూ... పెట్టే వాళ్లకు లేకపోయినా తినేవాళ్లకయినా ఉండాలి బుద్ది’’ ఈమాటలు విని ఆ అమ్మ తట్టుకోలేకపోయింది. ‘‘మీరు మనుషులా రాక్షసులా? విరోధి అయినా ఆకలి అంటూ వస్తే ఇంత అన్నం పెడతామే. మీ తోబుట్టినవాడు, మీ కంటే చిన్నవాడు ఇన్నాళ్లకు ఇంటికొస్తే రెండు అర్ష ముక్కలు పెట్టానని మీ ఇష్టం వచ్చినట్లు వాగుతారా’’ అని ఆ కొడుకుపై మండి పడింది.‘‘తేరగా తినడానికి ఇది ధర్మసత్రం కాదు’’ అని సన్నాయి నొక్కులు నొక్కింది కోడలు.

‘‘అయినా వాడికి కాళ్లు లేవా చేతులు లేవా? కష్టపడి సంపాదించి కడుపు నిండా తినవచ్చు కదా. ఎవరొద్దాన్నారు?’’ అని తమ్ముడిపై  విరుచుకుపడ్డాడు అన్న.‘‘అసలు వాడికి తిండి ఎందుకన్నయ్యా.కవిత్వం వెలగబెడుతున్నాడు కదా. దాన్నే తిని బ్రతకమను’’ అని వెటకారం చేశాడు చిన్న అన్నయ్య.మరో వైపు వేణు ఏదో  వెదుకుతున్నాడు.‘‘వదినా! ఇక్కడ నాది ఒక ఫైలు ఉండాలి’’ అని వదినను అడిగాడు. మళ్లీ అందుకున్నాడు అన్నయ్య...‘‘ఆడవాళ్లను అడుగుతావేరా, నన్ను అడుగు చెబుతాను. అక్కడ ఉన్న ఫైలు, చెత్తకాగితాలు ఒక్క రూపాయికి అమ్మేశాను’’‘‘ఏమిటీ నా గేయాలను అమ్మేశారా! నా కవిత్వం ఒక్క రూపాయికి అమ్మేశారా!!’’ బాధను అణుచుకుంటూ అడిగాడు వేణు.‘‘అవును. ఆ కిరాణం కొట్టు సుబ్బయ్య మంచోడు కనుక ఆ రూపాయి అయినా  ఇచ్చాడు’’ వెటకారపు కారాన్ని కళ్లలో చల్లాడు చిన్న అన్నయ్య.‘‘వాటి విలువ మీలాంటి మూర్ఖులకేం తెలుస్తుంది!’’ ఆవేశంగా అన్నాడు వేణు.అంతే అన్నయ్యల కోపం ఆకాశాన్ని అంటింది.‘‘ఏమన్నావ్‌ మేము మూర్ఖులమా! ఏరా ఆ కాగితాలతో పాటు నిన్ను కూడా ఆ చెత్త కుప్పలో తోస్తే కాని నీ రోగం కుదరదు. పదా పదా’’ అని మెడపట్టి తమ్ముడిని ఇంటి నుంచి  గెంటేశారు.

ప్రముఖ పత్రికాధిపతి ప్రసాద్‌ తన ఇంట్లో ఆరోజు కవి సమ్మేళనం  ఏర్పాటు చేశాడు.వచ్చిన అతిథులను ఆత్మీయంగా  ఆహ్వానిస్తున్నాడు ప్రసాద్‌.‘‘నమస్కారం ప్రసాద్‌గారు. ఈరోజు కవిసమ్మేళనం ఏర్పాటు చేశారట కదా అందుకే స్పెషల్‌గా వచ్చాను. అన్నట్లు ఈ వార్త మీ దాకా రాలేదా? అరే, ఊరంతా చెప్పుకుంటున్నారే. ఈమధ్య నేను కవిత్వంరాస్తున్నాను’’ అని గర్వంగా అన్నాడు సూటుబూటులో వచ్చినయాక్టర్‌ రావు.‘దేవుడా! నువ్వు కూడా కవిత్వం రాస్తున్నావా!’ అన్నాయి ఆయన కళ్లు.నోరు మాత్రం...‘‘ఓహో అలాగా. గుడ్‌’’ అన్నది.అక్కడ కూర్చున్న ఇద్దరు సాహితీ దిగ్గజాలకు ఈ రావును పరిచయం చేస్తూ...‘‘వీరు యాక్టర్‌రావు గారు, నటించడం మానేసి కవిత్వం మొదలుపెట్టారు. వీరు వేటూరిగారు, వారు ఆరుద్రగారు’’ అన్నాడు.‘‘ఏమిటి మీకా పిచ్చిపట్టుకుందా?’’ గెడ్డంతో నవ్వుతూ అడిగారుఆరుద్ర.‘‘మీ కవులు రాసిన నాటకాలు వేసి వేసి చివరికి ఆ జబ్బు నాకంటుకుంది’’ అన్నాడు యాక్టర్‌ రావు.‘‘అంటుకుందా! జబ్బుకు సరిౖయెన ప్రాస సబ్బు. సబ్బు కొనుక్కోండి’’ అని యాక్టర్‌రావుకిసలహా ఇచ్చారు ఆరుద్ర.రావు పెద్దగా నవ్వి...‘‘అంత్యప్రాస! అందుకే మిమ్మల్ని ఆరుద్ర అన్నారు’’‘‘ఆరుద్ర గారు మీరొక కవిత చెప్పాలి’’ అడిగారు అభిమానులు.అప్పుడు ఆయన ఇలా చెప్పారు.‘కవిత కోసమే నేను పుట్టాను.క్రాంతి కోసమే కలం పట్టాను.ఎండమావులు చెరిపిపండువెన్నెల నిలిపిగుండెవాకిలి తలుపు తట్టాను కవిత కోసమే నేను పుట్టాను’
  

మరిన్ని వార్తలు