విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్‌ ధర వింటే షాకవ్వుతారు!

12 Nov, 2023 11:19 IST|Sakshi

మెరిసే కళ్ళు, సొట్ట బుగ్గలతో ముద్దొస్తున్న ఈ క్యూట్‌ గర్ల్‌ పేరు ఐరా! మంచు విష్ణు, విరానికాల చిన్న కూతురు. ఐరా.. బుజ్జి మోడల్‌గా .. అమ్మ విరానికా స్టార్ట్‌ చేసిన ఫ్యాషన్‌ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేస్తోంది. ఆ ఫ్యాషన్‌ బ్రాండ్‌ గురించి కొన్ని విషయాలు..అమ్మ విరానికా .. ఐరాను ప్రేమగా  ‘చిన్న పుప్పిటా’ అని పిలిచుకుంటే .. నాన్న విష్ణు ‘బిగ్గెస్ట్‌ బ్లాక్‌మెయిలర్‌’ అంటూ ముద్దు చేస్తాడట.

ఇల్లు.. పిల్లలు.. వ్యాపారం.. ఈ మల్టీటాస్క్‌ని తనకు ఫింగర్‌ టిప్‌తో సమానమని నిరూపిస్తోంది విరానికా మంచు. న్యూయార్క్‌లో పుట్టి, పెరిగిన ఆమె..  జెమాలజీ, జ్యూలరీ డిజైన్, ఫ్యాషన్‌ మార్కెటింగ్‌లో డిగ్రీ చేసింది. సినీ హీరో మంచు విష్ణుని పెళ్లి చేసుకున్నాక ఇండియా వచ్చేసింది. ఇంట్లో వాళ్లకి కావలసిన డ్రెస్‌లు, నగలను తనే డిజైన్‌ చేస్తుంది. ‘విరానికా’ అని తన పేరు మీదే ఒక బొటిక్‌నీ నడుపుతోంది. అయితే అమ్మ విరానికా కల మాత్రం లండన్‌లో ఫ్యాషన్‌ స్టోర్‌ పెట్టాలనే! దాని కోసం వర్క్‌ చేసింది..

చివరకు సాధించింది. తాజాగా చిన్న పిల్లల కోసం ‘మేసన్‌ అవా’ అనే బ్రాండ్‌ని క్రియేట్‌ చేసింది. దాని స్టోర్‌ని.. వరల్డ్‌ ఫేమస్‌ లగ్జరీ డిపార్మెంట్‌ స్టోర్‌ అయిన హారోడ్స్‌ (లండన్‌)లో ఓపెన్‌ చేసింది. ఇక్కడ 2–14 సంవత్సరాల పిల్లల కోసం సరికొత్త డిజైన్స్‌లో అన్ని రకాల దుస్తులు ఉంటాయి. చాలా వరకు హ్యాండ్‌ మేడ్‌ డ్రెసెసే ఉంటాయి. ఈ బ్రాండ్‌కి బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు డిమాండ్‌ ఉంది. ఈ బ్రాండ్‌ డిజైన్‌ చేసిన గౌనును 2021లో ఐశ్వర్య రాయ్, అభిషేక్‌ బచ్చన్‌ల కూతురు ఆరాధ్య బచ్చన్‌.. తన పుట్టినరోజు నాడు వేసుకుంది. అమెరికన్‌ మోడల్‌ ప్యారిస్‌ హిల్టన్‌ సైతం ‘మేసన్‌ అవా’ డ్రెస్‌ వేసుకుంది. ధరలు హై రేంజ్‌లోనే ఉంటాయి.  ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక విరానిక కూతురు ఐరా ధరించిన మేసన్‌ అవా డ్రస్‌ ధర ఏకంగా  డ్రెస్‌ రూ. 99,520/-

(చదవండి: దీపాలతోనే కాదు..సంప్రదాయ దుస్తులతో కూడా కాంతిని నింపొచ్చు!)

మరిన్ని వార్తలు