వారఫలాలు : 2 ఏప్రిల్‌ నుంచి 8 ఏప్రిల్‌ 2017 వరకు

2 Apr, 2017 00:43 IST|Sakshi
వారఫలాలు : 2 ఏప్రిల్‌ నుంచి 8 ఏప్రిల్‌ 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరపు బంధువులను కలుసుకుంటారు. సోదరులతో వివాదాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. ఆరోగ్యం మందగిస్తుంది. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రో ణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. తెలుపు, ఆరెంజ్‌. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మీ ఆశయాలు నెరవేరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, లేత నీలం, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. బంధువులు, మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం. మీమాటకు ఎదురుండదు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. క్రీమ్, పసుపు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పోగొట్టుకున్న ఉద్యోగావకాశాలు తిరిగి దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు దక్కించుకుంటారు. కళాకారుల యత్నాలు సఫలమవుతాయి.
ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా కొంత లాభం చేకూరవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఎరుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీసేవలకు గుర్తింపు రాగలదు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నా క్రమేపీ అనుకూల పరిస్థితి. ఆదాయం ఆశాజనకమే. ఆలోచనలు కలసివస్తాయి. ఇంతకాలం వేధించిన కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వస్తు, వస్త్రలాభాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆశ్చర్యకమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. నలుపు, బంగారు రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు కొంత నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు మొదట్లో మందగించినా క్రమేపీ పుంజుకుంటాయి. కార్యదీక్షాపరులై ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. సోదరులు, సోదరీల నుంచి శుభవార్తలు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. గులాబీ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
 

మరిన్ని వార్తలు