ఓటింగ్‌కు ముందే బాబు ఓటమి!

19 Mar, 2019 01:40 IST|Sakshi

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కూడా కాకముందే చంద్రబాబు ఓటమి ఖరారైన సంకేతాలు వెలువడుతున్నాయి. 59 లక్షల ఓట్లను తొలగించేందుకు రెండేళ్లుగా టీడీపీ టెక్నాలజీ సాయంతో చేస్తూ వచ్చిన ప్రయత్నం ఐటీ గ్రిడ్స్‌ సా„ì గా బట్టబయలైపోయింది. బాబు పాలనపై తీవ్రమైన ప్రజా అసమ్మతికి తోడు రాష్ట్రంలో ఇడుపులపాయ నుంచి ఆ కొసన ఇచ్ఛాపురం దాకా సకల కుల, మత, వర్గ, వర్ణాలకు చెందిన ప్రజల కష్టసుఖాలను వైఎస్‌ జగన్‌  కళ్లారా చూశారు, చెవులారా విన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఇస్తున్న  ‘విన్నాను, నేనున్నాను’ అనే భరోసా ‘జగన్‌ రావాలి, జగన్‌ కావాల’న్న ప్రజాస్పందనకు ఆత్మీయ ప్రతిధ్వని.

‘‘దేశవ్యాప్తంగా జరుగనున్న 2019 సార్వ త్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీ కుంభకోణాలు జరిగే అవ కాశం ఉన్నందున దేశ అత్యున్నత రాజ్యాంగ సంస్థలైన సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వ్యవ స్థలపైన బృహత్‌ బాధ్యత ఉంది. రాజకీయ నాయకుల కుమ్ములాటలకు, కొట్లాటలకు దూరంగా, అతీతంగా ఈ సంస్థలు కనీస రాజ్యాంగ బద్ధమైన న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. గత అయిదేళ్లలోనూ ప్రభు త్వాలను వెలగబెడుతున్న రాజకీయ పాలకులు భారత రాజ్యాంగ వ్యవస్థలోని సకల శాఖలను తమ కాళ్ల ముందు మోకరిల్లేటట్లు చేశారు.

దీంట్లో భాగంగానే అధికారగణంలోని పెక్కుమందీ, న్యాయమూర్తులూ, పోలీసు అధికారులూ, సైనికాధికారులూ ప్రధాని నుంచి కింది స్థాయి మంత్రులు, ముఖ్యమంత్రుల ముందు.. వాళ్ల చుట్టూ ప్రచార ఊదర ద్వారా అల్లుకున్న కృత్రిమ కథనాలకు లోబడిపోయారు! దీని ఫలితంగా, మనది చట్టబద్ధంగా, చట్టాలను అతిక్రమించకుండా నడుచుకోవలసిన రిపబ్లిక్‌ రాజ్యాంగమన్న స్పృహనే వీరు కోల్పోయారు. ఈ క్లిష్ట సమ యంలో పాలకులు అధికారగణం ఒక ముఖ్యమైన అంశాన్ని మర్చి పోయారు. భారత రిపబ్లిక్‌ రాజ్యాంగం ఎవరో ధగ్గులు, పిండారీలు ఏర్పాటు చేసింది కాదనీ, దాని వైఫల్యం దారి తప్పిన వంకరబుద్ధి రాజకీ యవేత్తలైన పాలకుల ఎత్తుగడల ఫలితమని గుర్తించాలి’’.
– హరీష్‌ ఖరే ’ట్రిబ్యూన్‌’ పూర్వ సంపాదకుడు (17–03–2019)

ఆచరణలో రాజ్యాంగ వ్యవస్థల ఈ వైఫల్యం వల్లనే 70 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం ఈ వర్తమాన దశకంలో సామాజిక, ఆర్థిక, రాజ కీయ, ఎన్నికల రంగాల్లో  నిరోధించ వీలులేని స్థానంలో అక్రమాలు, అవినీతి, గూండాగిరి, రాజకీయ హత్యలూ విచ్చలవిడిగా పురివిప్పుతు న్నాయి. పైగా 2014 నుంచి టెక్నాలజీని స్వార్థ ప్రయోజనాలకు వాడకం లోకి తెచ్చుకుని ఎన్నికల ప్రక్రియను, ఫలితాలను కూడా తారుమారు చేసే స్థితికి ఎగబాకారు. ప్రత్యర్థివర్గాల విజయావకాశాలను దెబ్బతీయ డానికి సమాచార సాంకేతిక వ్యవస్థను వాడుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే పతనావస్థలో ఉన్న తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు 2019 ఎన్నికల ఫలి తాలను తనకు అనుకూలంగా రాబ ట్టుకునే వ్యూహంతో ’ఐటీ గ్రిడ్స్‌’ సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్ప జేసి, దానికి అనుబంధంగా విశాఖపట్నంలో ‘బ్లూఫ్రాగ్‌’ లాంటి అనా మక సంస్థలఏర్పాటు ద్వారా  తనను, తన పార్టీని అనుక్షణం నీళ్లు తాగిస్తున్న ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను, దాని అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి విజయావకాశాల్ని దెబ్బ తీయడానికి ఎత్తుగడ పన్నారు. కానీ దేశం దొంగలు దొరికిపోయి కొందరు పరారీలో ఉండగా మరికొందరు గ్రిడ్స్‌ నిర్వాహకులు అరెస్టై వారంట్లలో ఉండి కేసులు ఎదుర్కొంటున్నారు.

ప్రత్యర్థి పార్టీ, ఓటర్ల ఓట్లను తొలగించి ఆ పేరున్న ఓట్లు తమవి కావని ఓటర్లే దరఖాస్తులను పెట్టుకున్నట్లు మంత్రాం గాన్ని, యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నదాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 59 లక్షల ఓట్లకు చంద్రబాబు ఎసరు పెట్టాడు. ప్రస్తుత ఎన్ని కల సందర్భంగా ఈ తండ్రీ కొడుకులు ఓటర్ల జాబితాలను తారుమారు చేసే యత్నంలో ‘డేటా చోరులు’ (ఓటర్ల ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్స్, పాన్‌ నంబర్లను అనధికారి కంగా సేకరించి ఓట్లను తొలగించే కార్యక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారణ అయింది. అదే స్థాయిలో, విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నంతో ప్రారంభమైన ‘కత్తిపోటు’ రాజకీయం కాస్తా పులివెందులలో జగన్‌ పిన తండ్రి వివేకానందపై ‘గొడ్డలి వేటు’ రాజకీయం దాకా వెళ్లింది. బాబు– లోకేష్‌ల  ఒక దృష్టికోణంలో వివేకా హత్య ‘కుటుంబ తగాదాల ఫలితం’ అయితే మరొకరు చదువుకున్న అజ్ఞాని తరహాలో మాటలు తబ్బిబై పోయి ‘వివేకా మరణవార్త తెలిసి పరవశించిపోయాడ’ట (17.3.19).


‘నోట్లో చక్కెర, కడుపులో కత్తెర’ అన్న తెలుగువాడి సామెతకు ఇది ఆచరణలో అక్షరాకృతి. దొంగ డేటా స్వయం సంస్థల సమాచారంపై నమ్మకంతోనే బహుశా ‘ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటువేసేలా డేటా ప్రకారం కార్యకర్తలు కృషి చేయా లని, లబ్దిదారులంతా జెండా పట్టేలాగా వెంటపడమనీ (విశాఖ: 17.3.19) బాబు కోరి ఉంటారు. చివరికి వెఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఓటర్ల జాబితాలోని తన పేరును తొలగించమని కోరుతూ స్వయంగా దరఖాస్తు (ఫారమ్‌–7) పెట్టుకున్నట్టు ఎన్నికల ప్రక్రియను, ఎన్నికల కమిషన్‌ను అపహాస్యం చేసే చర్య కాస్తా బహిరంగం కావ డంతో కమిషన్‌ విస్తుపోయే పరిస్థితి వచ్చింది. బాబు దృష్టిలో ఈ ఎన్ని కల తేదీలను తొందరగా ప్రకటించి, ముందుకు నెట్టడం తనను ‘దెబ్బ కొట్టేందుకే రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు పెట్టార’ట! నిజమే, ఈసారి తొలి విడత ఎన్నికలు రాష్ట్రంలో రావడం తొలిసారిగానే కాదు, ఆదరాబా దరాగా, తక్కువ వ్యవధిలో ఎన్నికల షెడ్యూల్‌ (ఓట్లు చేర్చడం నుంచి నామినేషన్లు, వాటి పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, ఓటింగ్‌ తేదీల దాకా ‘నములుదునా, మింగుదునా’ అన్నంత హడావుడిలోనే) జరుగు తోంది.

ఇక ఈ తొక్కిసలాట మధ్యనే ‘సందట్లో సడేమియా’గా, జగన్‌పై 14 అక్రమకేసులు బనాయించి ‘క్విడ్‌ ప్రోకో’ ఆరోపణలపైన 16 మాసా లపాటు జైలులో నిర్బంధించడానికి వైఎస్సార్‌ మరణానంతరం కేంద్ర కాంగ్రెస్‌ నాయకత్వంతో ఆనాడే చేతులు కలిపిన ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చేదోడు వాదోడైన వ్యక్తి బాబు పూర్వపు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయరామారావుకి జాయింట్‌ డైరెక్టర్‌గా పని చేసిన లక్ష్మీనారాయణ ముందుకొచ్చారు.. ఒకవైపు వైఎస్‌ జగన్‌పై బాబుకు ఆసరాగా కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం మోపిన 14 కేసులకుగానూ, జగన్‌వల్ల మనీ లాండరింగ్‌లో భాగస్వాములయ్యా యన్న ఆరోపణపై అరెస్టయిన ఆ కంపెనీల యజమానులందరినీ బెయి ల్‌పైన కొందరిని, ఇతరులు కొందరిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానమే వరసబెట్టి విడుదల చేస్తూ వచ్చింది. కోర్టు పలుమార్లు ఇంతకూ మీ సాక్ష్యాలెక్కడ, ఎప్పుడు అంటూ సీబీఐ అధికారులను ప్రశ్నించవలసి వచ్చిందనీ, అయినా రుజువులు చూపలేక పోయారనీ గమనించాలి. గత పదేళ్లకు పైగా జగన్‌ను తప్పుడు కేసులతో వేధించడానికి కారకులయిన బాబుకి, జేడీ లక్ష్మీ నారాయణలాంటి ఆఫీసర్లకు ఏ శిక్షలు విధించాలి?

అదేం చిత్రమోగానీ, చంద్రబాబు హయాంలోనే రాజారెడ్డి సహా ముగ్గురు కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీరిలో ఒకరు హత్యకు గురికాగా, రాజశేఖర్‌రెడ్డి అనుమానాస్పద హెలికాప్టర్‌ ప్రమా దంలో కన్నుమూశారు  అంతకు రెండు రోజుల క్రితమే ప్రతిపక్ష నాయక హోదాలో చంద్రబాబు మాట్లాడుతూ, చిత్తూరు రచ్చబండ కార్యక్రమాల ప్రారంభానికి వెళుతున్న వైఎస్సార్‌ని ఉద్దేశించి– ‘తిరిగి అసెంబ్లీకి ఎలా వస్తాడో చూస్తా’ అని అన్నట్లు ఆనాడు పత్రికా వార్తలొచ్చాయి. ఆనాడు బాబుకి ఆప్తమిత్ర పక్షమైన ముఖేష్‌ అంబానీ కృష్ణా–గోదావరి పెట్రో లియం ఆయిల్‌ సంపదను గుజరాత్‌కు తరలించుకుపోతూ ఆంధ్రప్ర దేశ్‌కు అన్యాయం తలపెట్టగా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రాజ శేఖర్‌రెడ్డి ప్రభుత్వం అంబానీల ఆయిల్‌ దోపిడీని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆయిల్‌ అవసరాలను కనిపెట్టి, అంబానీలు ధర పెంచినందుకు వ్యతి రేకంగా ఒక్క తాటిమీద పోరాడింది.

ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని అరడజను లేఖలు కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాసి, శతపోరిన వారు రాజశేఖరరెడ్డి. అంబానీలతో, జేడీ లక్ష్మీనారాయణతో చంద్ర బాబుకు ఉన్న దోస్తీ ఎక్కడవరకు వెళ్లిందంటే– హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్సార్‌ అనుమానాస్పద ప్రమాదం తర్వాత, ప్రమాద వివరాలు అందించే ‘బ్లాక్‌బాక్స్‌’ను శోధించడానికి కేంద్రం నియమించవలసి వచ్చింది జేడీ లక్ష్మీ నారాయణనే. కానీ బ్లాక్‌బాక్స్‌లో ఆధారాలు దొర కలేదని ఆయన తేల్చారు. తండ్రి మరణానంతరం రాష్ట్రంలో వైఎస్సార్‌ అంతకుముందు తలపెట్టి జయప్రదంగా అమలు జరిపిన ఆరోగ్యశ్రీ పథకంతో 20 లక్షల మంది పేద, మధ్య తరగతి ప్రజలు లబ్ది పొందిన ఫలితంగా గుండెలు పగిలిన సుమారు 600 మంది లబ్దిదారులు ఆ పథకాలు ఇక అమలుకు నోచుకోవన్న బెంగతో చనిపోయారు. వారిని పరామర్శించేందుకు జిల్లాలకు జగన్‌ ఓదార్పు యాత్ర తలపెట్టగా, దానిని అడ్డుకునే క్రమంలో సోనియా–చంద్రబాబులు విభిన్న ప్రయోజ నాలతో చేతులు కలిపారు.

దివంగత ఎన్టీఆర్‌ అంతకుముందు ప్రకటించినట్టుగా ‘బాబు మొదటినుంచీ కాంగ్రెస్‌ మనిషిగానే వ్యవహరిస్తూ నా సీటుపైన కన్ను వేస్తూనే వచ్చాడు’ అన్నమాట అక్షర సత్యమై కూర్చుంది. ఇప్పుడు జగన్‌ దేశ రికార్డులనే కాదు, ప్రపంచ రికార్డునే తలదన్ని 3,600 కిలోమీ టర్లపైన రాష్ట్రంలో, భూమ్యాకాశాలను ఒక్క దగ్గరికి చేర్చినట్లు ఇడుపుల పాయ నుంచి ఆ కొసన ఇచ్ఛాపురం దాకా సకల కుల, మత, వర్గ, వర్ణాలకు చెందిన ప్రజల కష్టసుఖాలను కళ్లారా చూశారు, చెవులారా విన్నారు. తల్లి, పిల్లాదిగా గోముగా నిమిరారు, తానూ వారి గోరుము ద్దలు తిన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఇక తను ప్రజల నుంచి దూరం కావాలని అనుకున్నా దూరం కాలేరు. ‘విన్నాను, నేను న్నాను’ అన్న భరోసా ‘జగన్‌ రావాలి, జగన్‌ కావాల’న్న ప్రజా స్పంద నకు ఆత్మీయ ప్రతిధ్వని. అనితర సాధ్యమైన తన సుదీర్ఘ పాద యాత్ర జగన్‌కు శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం కలిగించి, కరిగిం చిన శాశ్వతానుభవం కాగలదని ఆశిస్తూ...


abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు