కొయ్యగుర్రం సవారీ ఇక చాలు!

21 Oct, 2017 00:44 IST|Sakshi

జాతిహితం
ఉత్తర భారతంలోని వాయు కాలుష్యం జాతీయ అత్యవసర పరిస్థితిగా భావించాల్సినంతటి తీవ్ర సంక్షోభంగా మారింది. ‘మనం ఏమైనా చేయాల్సిందే’నంటూ మన కార్యకర్తలు– న్యాయసంస్థల కూటమి సదుద్దేశాలతో పటాసులు, పాత వాహనాలు, డీజిల్‌ తదితరాలపై నిషేధం విధించింది. అయినా ఢిల్లీ గాలి, గ్యాస్‌ ఛాంబర్‌ స్థాయిల్లోనే ఉంది. విషపూరితమైన ఆ గాలి మునిసిపల్‌ లేదా జాతీయ సరిహద్దులను లెక్కచేసేది కాదు. అతి తీవ్ర సమస్యను చిల్లరమల్లరదిగా మార్చి మనల్ని మనం వెర్రిబాగుల వాళ్లను చేసుకుంటున్నాం.

రాజ్‌కపూర్‌ బాబీ (1973) సినిమాలో లతా మంగేష్కర్‌ గొంతుతో డింపుల్‌ కపాడియా ‘‘ముఝె కుచ్‌ కెహనా హై’’ (నాకేదో చెప్పాలని ఉంది) అంటే... రిషీ కపూర్‌ నాకూ ఏదో చెప్పాలని ఉందంటూ గొంతు కలుపుతాడు. ఆనంద్‌ బక్షీ రాసిన ఆ మృదు మధుర గేయం టీనేజర్ల హృదయ తంత్రువులను మీటుతుంది. మనం ఇప్పుడు విశ్లేషిస్తున్న అంశానికి సంబంధించి అలాంటి మృదువైనది ఏదీ లేదు.  సుప్రసిద్ధమైన ఆ గీతంలోని ‘‘కెహ్నా’’ (చెప్పాలని) స్థానంలో ‘‘కర్నా’’(చెయ్యాలని) పెట్టి, మెలితిప్పి ఉత్తర భారతంలోని వాయు కాలుష్య సమస్యను విశ్లేషిస్తాను. జాతీయ అత్యవసర పరిస్థితిగా భావించాల్సినంతటి తీవ్ర సంక్షోభంగా మారిన ప్రాణాంతక వాయు కాలు ష్యం పట్ల సాధారణంగా మనం డింపుల్‌ పాటకు వంతలాగా ‘‘ముఝె కుచ్‌ కర్నా హై’’ (నాకు ఏదో చే యాలని ఉంది) అని బృందగానం చేస్తాం. మనతో పాటూ ప్రభుత్వ పెద్దలు, న్యాయవ్యవస్థ, కార్యకర్తలు, మీడియా, అందరిలోకీ అతి తెలివైనవారైన రాజకీయవేత్తలు... రిషీ కపూర్‌లా ‘‘ముఝె భీ కుచ్‌ కర్నా హై’’ (నాకూ ఏదో చేయాలని ఉంది) అనేస్తారు.

కాలుష్య వ్యతిరేక యోధుల సాహçసగాథ
ప్రతి ఒక్కరూ డింపుల్‌ అంతరంగంలోని ఆ ‘‘ఏదో’’ని పట్టుకు వేలాడుతారు. మీడియా అద్భుత పతాక శీర్షికలను సృష్టిస్తుంది, మాటల రాయుళ్లు విజ యాన్ని ప్రకటించేస్తారు. ఢిల్లీని కమ్మేసే పొగ మేఘాలకు చిట్కా పరిష్కా రాలను ప్రకటించి, వీరోచితంగా పొగను చావుదెబ్బ తీసేశామని హర్ష  ధ్వానాలు చేయడం ఎన్నిసార్లు జరిగిందో గూగుల్‌ను శోధించి చూడండి. ప్రత్యేకించి దీపావళి–శీతాకాలం మాసాల్లో ఈ తంతు మరీ విపరీతం. అంతే గానీ, అసలు పెద్ద సమస్యపై పరిశోధన జరిపి, పరిష్కరించే ప్రయత్నాలు చేసింది మాత్రం లేదు. అందుకు చాలా కాలం పడుతుంది, నిజమైన పరి ష్కారాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండవు. ఆ పనులు చేయాలంటే ఎంతో సమయం, కఠోరమైన శ్రమ అవసరం. ఈ అత్యవసర సమస్య గురించి  ఏమీ చేస్తున్నట్టు కనిపించడం లేదు కాబట్టి, కనీసం మనం ‘‘ఏదో’’ అయినా చేద్దాం. కొయ్య గుర్రం పైకెక్కి స్వారీ చేసే అవకాశం మనకు లభించడం వల్ల కలిగే హాని ఏమీ లేదు. లేదంటే, మనకు ఇష్టమైన రాక్షస సంహారం చేసేస్తే సరి. నేను చేయాల్సింది ఏదో చేసేశాను కాబట్టి ఇక నా బాధ్యత ముగిసి పోతుంది.

ఈలోగా మీరు, ఎయిర్‌–ప్యూరిఫయర్‌ను (ఎయిర్‌ కండిషనర్‌ కంటే ఖరీదైనది) కొనుక్కోండి. ఆ స్తోమత లేకపోతే ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆ దేవుణ్ణి ప్రార్థించండి.
కాలుష్యం పొగను పరిమార్చే మన వీరాధివీరులు పతాక శీర్షికలకు ఎక్కుతూ చాలా ఏళ్లుగా చేసిన వీరోచిత కృత్యాల సంక్షిప్త వర్ణన ఇది. ఒకరు నిర్దిష్ట కాల పరిమితికి మించిన వాహనాలేవీ రాజధానిలో తిరగడానికి వీల్లే దంటూ నిషేధం విధించారు. మరొకరు డీజిల్‌పై విరుచుకుపడ్డారు, నగరం లోకి ప్రవేశించే భారీ ట్రక్కులపైన కాలుష్యం పన్ను విధించారు, నిర్మాణ ప్రాంతాల్లో పనుల నిలుపుదలకు ఇష్టానుసారం ఆజ్ఞలను జారీ చేశారు. నీళ్లు చల్లాలని ఆదేశించారు. శిథిలాలను రోడ్డు పక్కన వదిలే కుటుంబాలపై జరి మానాలు (రూ. 50,000కు తక్కువ కాదు) విధించారు. ఎయిర్‌–ప్యూరి ఫైయర్‌ బ్రాండ్లు ప్రాయోజకులుగా టీవీ చానళ్ల నిరంతర ఆర్భాటంతో ఒక అసాధారణమైన పథకాన్ని సైతం అమలు చేశారు. ఇప్పుడిక పటాసులనునిషేధించారు.

ఫలితంగా మన వాయు నాణ్యత ఏ మాత్రం మెరుగయిం దం టారు? ఎయిర్‌–ప్యూరిఫయర్లలోని రీడింగ్‌లను ఒక్కసారి చూడండి.సుప్రీంకోర్టు మిస్టర్‌ జస్టిస్‌ ‘‘పర్యావరణం’’ కుల్‌దీప్‌సింగ్, ప్రజా వ్యాజ్య యోధుడు ఎమ్‌సీ మెహతాల కాలంలో, 1990ల మధ్యలో కార్య కర్తలు–న్యాయసంస్థల కూటమి ఆవిర్భవించింది. అయితే వారిద్దరూ ఈ సమస్య పరిష్కారం దిశగా నిజమైన కృషినే చేశారు. దేశ రాజధానిలోని ప్రభుత్వం, వాణిజ్య రవాణా వాహనాలన్నీ సీఎన్‌జీకి మారే పని విజయ వంతంగా పూర్తికావడం వారి ఘనతే. అది వాయు నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను తెచ్చింది. కానీ అలా జరిగిన మేలు దశాబ్ది క్రితమే అడు గంటిపోయింది. ఆ తర్వాత జరిగిన కృషిలో చాలా వరకు గారడీ విద్యలు, ఆలోచనరహితమైన, అహంకారపూరితమైన, నిరంకుశమైన చర్యలే. కార్య కర్తలం, న్యాయమూర్తులం, మీడియాలోని మిత్రులమైన మాకు మీకేది ఉత్త మమో తెలుసు. కాబట్టి మేం ఆదేశిస్తాం, మీరు శిరసావహించండి. కోర్టు ధిక్కార భయంతో ఎదురు ప్రశ్నలు వేయకండి, జవాబుదారీతనాన్ని కోర కండి. ఈలోగా మీ పిల్లలకు నెబ్యులైజర్లను (ఉబ్బసం వంటి రోగ బాధి తులకు ఊపిరి సలపడానికి ఆవిరి రూపంలో మందును అందించే ఉపకర ణాలు) వాడటం నేర్పించండి. ఇదీ  వారి ధోరణి.

విడ్డూరపు పరిష్కారాలు
ఢిల్లీ వాయు కాలుష్యం సమస్య అతి తీవ్రమైనది. అందుకు సూచించే కొన్ని పరిష్కారాలు మరీ విడ్డూరమైనవి, అనాలోచితమైనవి. హఠాత్తుగా ఢిల్లీలోని కుటీర పరిశ్రమలన్నీ బవనా వంటి ప్రాంతాలకు తరలాలన్నారు. కనీసం భౌతిక, మానవ వనరుల పరమైన మౌలిక సదుపాయాలను నిర్మిం చాల్సిన బాధ్యతను సైతం విస్మరించారు. కొంత సమయం ఇచ్చే ఓపికైనా చూపలేదు. ప్రభుత్వ రవాణా సదుపాయాలు, గృహవసతి ఏర్పాట్లయినా లేకుండానే ఆ పరిశ్రమను, ఉద్యోగాలను తరలించారు. ఫలితంగా ఎన్నో ఉద్యోగాలు పోయాయి, ల్యాండ్‌ మాఫియాలు నిర్మించిన కొత్త మురికి వాడలు, అక్రమ గృహసముదాయాలు పుట్టుకొచ్చాయి. ఇంతా చేసి దీనివల్ల జరిగింది ఏముంది? సాపేక్షికంగా రాజధానికి ప్రధాన భాగం లోపలి కాలు ష్యాన్ని వెలుపలకు తరలించడం మాత్రమే. ఢిల్లీలో ఎలాంటి పరిశ్రమలు ఉండాలనే విధానం గురించి, ఆ దిశగా సాగడం గురించి తగినంతగా ఆలో చించిందే లేదు. సమాజంలోని విశేష హక్కులున్న ఒక సముదాయం తమ కాలుష్యాన్ని తమకంటే తక్కువ స్థాయివారిపైన రుద్దగలగడం హాస్యాస్పదం. ఆ విషపూరి తమైన గాలి మునిసిపల్‌ లేదా జాతీయ సరిహద్దులను లెక్కచేసేది కాదని లెస్టర్‌ బ్రౌన్‌ మనకు బోధించారు.  పర్యావరణ కార్యకర్తల ఉద్యమ పితామ హుడైన ఆయన, ఈ సమస్యపై రచించిన సాధికారిక గ్రంథం వరల్డ్‌ వితవుట్‌ బార్డర్స్‌లో (1972) ఈ విషయాన్ని తెలిపారు.

2015లో ఒకప్పటి సామాజిక కార్యకర్తల పార్టీ ఆప్‌ ఢిల్లీలో అధికారం లోకి వచ్చింది. వెంటనే అది తన పాత అవినీతి వ్యతిరేక ఎజెండాను కాలుష్య వ్యతిరేకమైనదిగా మరల్చి, ఈ గారడీ విద్యను పూర్తిగా భిన్నమైన మరో స్థాయికి చేర్చింది. నా సహోద్యోగి రాజగోపాల్‌ సింగ్‌ సహాయంతో ముందు పేర్కొన్న వాస్తవాలను గుదిగుచ్చాను. ఒకటి,ఆప్‌ ప్రభుత్వం సరి/బేసి పథ కాన్ని ప్రవేశపెట్టింది. దాని వల్ల వాయు నాణ్యతలో ఎలాంటి మార్పూ లేదు. ఆ తర్వాత అత్యంత కాలుష్యభరితమైన ప్రాంతాల్లో ఐదు భారీ ఎయిర్‌ ప్యూరి ఫయర్లను, ఒక మిస్ట్‌ ఫౌంటెయిన్‌ను, ఒక వర్చ్యువల్‌ చిమ్నీని నెలకొల్పింది. 2016 అక్టోబర్లో ‘‘ప్రయోగాత్మక ప్రాతి పదిక’’పై వాటిని పని చేయించింది కూడా. మన ఊపిరి తిత్తులను ఘోరంగా నాశనం చేసే దుమ్మును తగ్గించడం కోసం రోడ్లను వాక్యుం క్లీనర్లు, యంత్రాలతో శుభ్రం చేయిస్తామని కూడా వాగ్దానం చేసింది. ఈ మధ్య అలాంటిది ఏదైనా కనిపించిందా?

దేవుడైనా విప్పలేని చిక్కుముడి
ఈలోగా, పర్యావరణ కాలుష్యం (నివారణ, నియంత్రణ) సంస్థ (ఈపీసీఏ), సుప్రీం కోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌... వాహనాలు, ఇంధనాలపై తమ సొంత ఆదేశాలను చాలా వాటిని జారీ చేస్తుంటాయి. అవేమిటో అర్థం కావాలంటే మెక్‌ కిన్సీ లాంటి అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థను ఆశ్రయించాల్సిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఈపీసీఏ, సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికను చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. ప్రత్యేకించి అందులోని సుప్రీం ఆదేశాల అమలు ప్రస్తుత పరిస్థితిపై నివేదిక (పేజీ 14–21)లోని అంశాలు ముఖ్యమైనవి. రాజధానిలోని పొగకు సంబం ధించి సుప్రీం కోర్టు కార్యాచరణ ప్రణాళికపై ఏప్రిల్‌ 4న ఈపీసీఏ సమర్పిం చిన నివేదిక అంతకంటే ఎక్కువ విషయాలను వెల్లడిస్తుంది (పేజీ. 10–29). అది చాలా అర్థవంతమైనది, సమగ్రమైనది, పరిశుద్ధ ప్రపంచాన్ని ఆవిష్క రించేది. కానీ విప్లవానికి వెంట్రుక వాసి మాత్రమే తక్కువైన ఆ ప్రణాళికను అమలు చేయడం అసాధ్యం. ఢిల్లీతో పాటూ కేంద్రం, పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు డజను సంస్థలు దానికి కట్టుబడాలి. భారీ బడ్జెట్లతో వేలాది బస్సు లను కొనాలి, ప్రత్యేక రహదారులను నిర్మించాలి, ఇంధనపు, పన్నులు విధిం చాలి. రాజధాని సరిహద్దు వ్యవసాయ ప్రాంతాలు, దూరంగా ఉన్న హరి యాణా, పంజా»Œ  మునిసిపల్, పౌర సంస్థలు పలు చర్యలను చేపట్టాలి. దాన్ని అమలు చేయడానికి కనీసం ఒక పూర్తికాలపు సుప్రీం కోర్టు ధర్మాసనం అవసరం. చదవడానికి అది అద్భుతంగా ఉంటుంది గానీ, అమలుచేయడం అసాధ్యమని అత్యంత గౌరవంగా చెప్పాల్సి వస్తోంది. క్రూరంగానే ఉండొచ్చు గానీ ఒక్కసారి వాస్తవాలను చూద్దాం. 2010లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ తర్వాత ఒక్క కొత్త బస్సును కూడా కొనలేదు. ఇప్పుడు నడుస్తున్న మెట్రో దశ–3 పనులు ఒక ఏడాదికిపైగా, దశ–4 పనులు రెండున్నరేళ్లు ఆలస్యం అయ్యాయి. మొత్తంగా ఇది ఆ భగవంతుడైనా విప్పలేని చిక్కుముడి.

కటువుగానే ఉండొచ్చుగానీ నిజం చెప్పక పోవడం పిరికితనం, మన పిల్లల ఊపిరితిత్తుల విషయంలో దగాకు పాల్పడటం. ఎమ్‌సీ మెహతా ప్రజా వ్యాజ్యం ఫలితంగా  1985 నుంచి ఏర్పడ్డ ఈ కమిటీలు అద్భుతంగా కృషి చేశాయి. కానీ ఇప్పుడు అవి కాలదోషం పట్టి నిరర్థకంగా మారాయి. 20 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈపీసీఏ అధిపతి భూరే లాల్‌ 1998 నుంచి ఆ  బాధ్యతలలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో మన వాయు నాణ్యత ఏమైనా మెరుగై ఉంటే బాగానే ఉండేది. ఇప్పుడిక ఈ సమస్య పరిష్కారానికి ఒక సాధికారిక రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ సంస్థలో సంబంధిత ముఖ్యమంత్రులంతా ఉండాలి. వారికి తగు లక్ష్యాలను నిర్దేశించి, జవాబుదారీతనం వహించేలా చేయాలి. అవసరమైతే ప్రధాని దానికి నేతృ త్వం వహించాలి. ఇది, న్యాయస్థానాలు ఇకపై ఫుట్‌పాత్‌లను వీడాలని అత్యంత వినయంగా మనవి చేయాల్సిన సమయం కూడా. అవి ఇంతవరకు చాలా చేశాయి. పరిపాలనా వ్యవస్థ తన బాధ్యతలను మీ మీదికి నెట్టేయ డాన్ని అను మతించడం ఎందుకు. ఇక విశ్రమించి, పాలనా వ్యవస్థ చేపట్టే చర్యల నిరర్థకతను పరిహసించండి.

- శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు