చుక్కలు చూపిన ఏటీఎంలు

14 Nov, 2016 13:16 IST|Sakshi
చుక్కలు చూపిన ఏటీఎంలు

- ఎక్కడికెళ్లినా ‘నో క్యాష్’ బోర్డులు  
- అప్‌డేట్ కాని సాఫ్ట్‌వేర్.. కనిపించని రూ.2 వేల నోట్లు
 
 సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: ‘ఔట్ ఆఫ్ సర్వీస్..’ ‘ఔట్ ఆఫ్ ఆర్డర్..’ ‘నో క్యాష్..’ ‘క్లోజ్డ్..’ రాష్ట్రంలో శుక్రవారం ఎక్కడ చూసినా ఏటీఎం కేంద్రాల వద్ద కనిపించిన బోర్డులివి! ఏటీఎంలు పనిచేయకపోవడంతో జనం నరకం చూశారు. అటు బ్యాంకులకు వెళ్తే బారులు.. ఇటు ఏటీఎంలకు వెళ్తే ‘నో క్యాష్’ బోర్డు లు చూసి తలలు పట్టుకున్నారు. వరుసగా మూడోరోజూ ‘నోటు’ కోసం అల్లాడారు. చిల్లర తిప్పలూ తప్పలేదు. హైదరాబాద్ తోపాటు కొన్ని పట్టణాల్లో అరకొరగా పని చేసిన ఏటీఎం కేంద్రాల్లో కేవలం రూ.100 నోట్లు మాత్రమే అందారుు. రూ.2 వేల నోటు జాడే కనిపించలేదు. జనం పోటెత్తడంతో అటు బ్యాంకులు కూడా చేతులెత్తేశారుు.

ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.4 వేలు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నా.. కరెన్సీ కొరతతో చాలాచోట్ల రూ.2 వేలు మాత్రమే చేతిలో పెట్టారుు. ఇక ఆసుపత్రుల్లో పాత నోట్లు చెల్లుతాయని కేం ద్రం స్పష్టంగా చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ‘పాత నోట్లు చెల్లవు..’ అంటూ ఏకంగా బోర్డులు పెట్టేయడంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. మొత్తమ్మీద ‘కరెన్సీ ఎమర్జెన్సీ’నుంచి రాష్ట్రం ఇంకా తేరుకో లేదు. ఆర్థిక కార్యకలాపాలు గాడినపడలేదు. చిరు వ్యాపారాల నుంచి బడా షాపింగ్‌మాల్స్ వరకు లావాదేవీలు స్తంభించిపోయారుు. హైదరాబాద్‌లో ఏటీఎంలు పనిచేయక పోవడంతో శుక్రవారం ఒక్కరోజే రూ.300 కోట్ల లావాదేవీలు నిలిచిపోయారుు.

 బ్యాంకులు కిటకిట
 నోట్ల మార్పిడి, నగదు డిపాజిట్ చేసేందుకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకులు కిటకి టలాడారుు. నగదు మార్పిడి కేవలం రూ.4 వేల వరకే  పరిమితం చేయడంతో అత్యవసర పనులు, వివాహలు వంటి శుభ కార్యాలు న్నవారు నానా అవస్థలు పడ్డారు. పోస్టాపీసుల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బ్యాంకులు, పోస్టా ఫీసుల వద్ద వందల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడంతో పలు చోట్ల తోపులాటలు చోటుచేసు కున్నారుు. డబ్బులు మార్చు కోవడానికి బ్యాంకుల్లో సహా యకులు లేకపోవడంతో దర ఖాస్తులు నింపడం రానివారు అనేక కష్టాలు పడుతున్నారు.

నోట్ల మార్పిడికి వికారాబాద్ జిల్లాలో జనం అవస్థలు పడ్డారు. వికారా బాద్, తాండూరు, పరిగి, కొడంగల్ సెగ్మెంట్లలో బ్యాంకుల వద్ద ఉదయం నుంచే ప్రజలు క్యూ కట్టారు. చంటిపిల్లలతో వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్త నోట్ల పంపిణీ ప్రారంభించిన రెండు రోజులుకే సిద్దిపేట జిల్లాలో బ్యాంకులు చేతులెత్తేశారుు. కొన్ని బ్యాంకుల్లో గురువారానికే డబ్బు అరుు పోరుుంది. ఏటీఎంలలో చాలాచోట్ల వాటిలో డబ్బులే పెట్టలేదు. కరీంనగర్ జిల్లాలో కొన్ని బ్యాంకుల్లో కొత్త రూ.2 వేల నోటు అందిం చగా, చాలా బ్యాంకుల్లో రూ.100 నోట్లనే అందిస్తున్నారు. జిల్లాలో ఏటీఎంలు కూడా పని చేయలేదు. పోస్టాఫీసుల్లో ఖాతాలున్న నగదు జమ చేసినా.. కొత్త నోట్లు ఇంకా రాకపోవడంతో ఖాతాదారులకు ఇవ్వలేక పోతున్నారు. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.

 బార్లు, మద్యం దుకాణాలు వెలవెల
 బార్లు, మద్యం దుకాణాలు మందుబాబుల తాకిడిలేక వెలవెలబోతున్నారుు. హైదరాబాద్‌లో అమ్మకాల్లో సుమారు 40-50 శాతం వరకు కోత పడిందని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్య ప్రాంతాల్లోని బార్లు, మద్యం దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులతో మద్యం సరఫరా చేస్తున్నారు. ధర తక్కువ ఉండే చీప్ లిక్కర్ అమ్మకాల్లో 60 శాతం మేర కోతపడినట్లు పేర్కొన్నారు. మహానగరం పరిధిలో 500 మద్యం దుకాణాలు, మరో 571 బార్లుండగా.. అందులో సగం దుకాణాలకు గిరాకీ లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.

 యాదాద్రిలో రద్దీ.. తోపులాట
 నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సాయంత్రం వరకు ఏటీఎంలు పనిచేయలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్, మోటకొండూరుతోపాటు భువనగిరిలో పలుచోట్ల ఉదయం 11 గంటల నుంచి ఏటీఎంలు పనిచేశారుు. గుట్టలోని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద రద్దీ కారణంగా తోపులాట జరిగి అద్దాలు ధ్వంసమయ్యారుు. పోలీసులు కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
 
 అప్‌డేట్ కాని సాఫ్ట్‌వేర్
 ఏటీఎం కేంద్రాలు పని చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మిషన్లలో నింపేందుకు పూర్తి స్థారుులో కొత్త కరెన్సీ రాకపోవడం ఒకటి. ఏటీఎం మిషన్లకు రూ.2 వేల నోటు కొత్త. అందులోని సాఫ్ట్‌వేర్ కొత్త నోటును గుర్తిం చే లా ఇంకా అప్‌డేట్ కాలేదు. అప్‌డేట్ చేయకుండా నోట్లు నింపినా ఫలితం ఉండదని అధికారులు చెప్తున్నారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రక్రియ నడుస్తోందని, పూర్తరుున తర్వాత ఏటీఎంలు పని చేస్తాయంటున్నారు. శనివారానికి సాఫ్ట్ వేర్‌ను అప్‌డేట్ చేస్తామని పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో 45 రకా ల ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులవి 7 వేల ఏటీఎంలు ఉన్నట్లు అం చనా. కరెన్సీ కొరత, సాఫ్ట్‌వేర్ సమస్యల వల్ల శుక్రవారం 300 కోట్ల లావాదేవీలు ఆగిపోయాయని అధి కారులు అంచనా వేస్తున్నారు.
 
 అమాయకులకు టోకరా
 ఖిల్లాఘనపురం: పెద్ద నోట్ల మార్పిడి కోసం గంటలపాటు నిలబడి సామాన్యులు అలిసిపోతుంటే.. ఇదే అదునుగా తీసుకుని మోసగాళ్లు చేతివాటం ప్రదర్శించారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురంలో శుక్రవారం రెండు బ్యాంకుల వద్ద జనాలను మోసగించి రూ.66 వేలతో మోసగాళ్లు పరారయ్యారు. ఘనపురం ఆంధ్రా బ్యాంక్ వద్ద నోట్లు మార్చుకునేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు. షాపురానికి చెందిన శాంతన్న రూ.16,500, సాముల వెంకటేశ్ రూ.15,500తో బ్యాంక్‌కు వచ్చారు. చదువు రాకపోవడంతో ఓచర్ రారుుంచుకునేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఆశ్రరుుంచారు. అతను ఓచర్ రాస్తానని నమ్మబలికి, నోట్లు లెక్కబెడుతానని రూ.32 వేలు తీసుకున్నాడు. తర్వాత వైట్ పేపర్ తెమ్మని శాంతన్నకు చెప్పాడు. అతను రాకపోవడంతో పిలుచుకొస్తానని చెప్పి ఆ దుండ గుడు జారుకున్నాడు.

కొంతసేపటికి ఇద్దరు అతడి కోసం వెతికారు. కనిపించకపోవడంతో మోసపోయామని అర్థ మై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోళీపురం ఎస్‌బీహెచ్ లో నోట్లను మార్చుకునేందుకు సల్కెలాపురానికి చెందిన మాదాసు భద్రయ్య, నర్సమ్మ దంపతులు బ్యాంక్‌కు రాగా, భద్రయ్య క్యూలో నిల్చున్నాడు. ముందున్న వ్య క్తి భద్రయ్యతో మాట్లాడుతూ బ్యాంకు వద్ద ఇంతమందిమి లైన్ లో ఎండకు ఉన్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. పై అధికారులకు ఫోన్ చేస్తా ఓ రీచార్జ్ కార్డు తీసుకురమ్మని చెప్పాడు. తన లైను పోతుందని, తన డబ్బులు కూడా బ్యాంకులో వేయాలని కోరుతూ ఆ వ్యక్తికి భద్రయ్య రూ.34 వేల నగదు ఇచ్చి, కార్డు కోసం వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి సదరు వ్యక్తి పరారయ్యాడు.
 
 రెండ్రోజుల్లో పెళ్లి.. ఏం చేయాలి?
 ‘‘రెండ్రోజుల్లో నా కూతురు పెళ్లి ఉంది. నా దగ్గర రూ.1000, రూ.500 ఉన్నారుు. పెళ్లి సరుకులకు, ఏ పనికెళ్లినా పెద్ద నోట్లను వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. నేనేం చేయాలి? బ్యాంకుకు వెళ్తే రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఉన్నత వర్గాలకంటే సామాన్యులే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు.
 - మోడెం కొమరయ్య, గార్ల, మహబూబాబాద్ జిల్లా
 
 నోట్లు చెల్లక.. వైద్యం అందక
 పెద్ద నోట్లు చెల్లక.. చిల్లర లేక.. చివర కు వైద్యం అందక ఓ వృద్ధురాలు ఆందో ళనకు గురైంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన శివ్వమ్మ తీవ్ర కడుపు నొప్పితో శుక్రవారం వెల్దుర్తిలోని ఓ ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ చేరుుంచుకోవాలని డాక్టర్ చెప్పడంతో అక్కడికి వెళ్లింది. అక్కడ ఫీజు రూ.200కుగాను రూ.500 నోటిస్తే చెల్లదన్నారు. బ్యాంకుల్లో ఖాతా, గుర్తింపు కార్డు లేకపోవడంతో పెద్దనోటు చెల్లుబాటు కాక కడుపునొప్పితోనే ఇంటిముఖం పట్టింది.
 
 నేను బ్యాంకుల చుట్టూ ఎలా తిరగాలి
 ఈ నెల 20న డెలీవరీ కోసం డాక్టర్ సమయం ఇచ్చారు. ఆస్పత్రికి వెళ్తే రూ.500 నోట్లు తీసుకోవడం లేదు. నా వద్ద రూ.500 నోట్లు మాత్రమే ఉన్నారుు. బ్యాంకులో రోజు 4 వేలకు మించి డబ్బులు మార్పిడి చేయడం లేదు. ఎవరి అకౌంట్ ఉంటే వారే.. ఆధార్ కార్డుతో స్వయంగా వస్తేనే మార్పిడి చేస్తామంటున్నారు. కానీ.. నేను ఎటూ తిరగలేని పరిస్థితి ఉంది.
 - మమత, మంచిర్యాల

>
మరిన్ని వార్తలు