ఆళుక్కు పాది 50-50 ఫస్ట్‌లుక్ | Sakshi
Sakshi News home page

ఆళుక్కు పాది 50-50 ఫస్ట్‌లుక్

Published Sat, Nov 12 2016 3:04 AM

ఆళుక్కు పాది 50-50 ఫస్ట్‌లుక్

ఆళుక్కు పాది 50-50 చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. కన్నా లడ్డూ తిన్న ఆశైయా చిత్రంలో సంతానంతో కలిసి నటించిన సేతు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఆళుక్కు పాది 50-50. ఆయనకు జంటాగా శ్రుతి రామకృష్ణ నాయకిగా నటించిన ఈ చిత్రంలో నాన్‌కడవుల్ రాజేంద్రన్, బాలశరవణన్ ముఖ్య పాత్రలను పోషించారు. లిపీ సినీ క్రాఫ్ట్స్ పతాకంపై ఏఎస్.రంజిత్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణసాయి దర్శకత్వం వహిస్తున్నారు. ధరణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సేతు మిత్రుడు, ప్రముఖ నటుడు సంతానం శుక్రవారం విడుదల చేశారు.

చిత్రం టీజర్‌ను శుక్రవారం సాయంత్రం సంతానం ఆవిష్కరించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఈ సందర్భంగా వాలిభరాజా చిత్రం తరువాత తాను నటిస్తున్న చిత్రం ఆళుక్కు పాది 50-50 అని చిత్ర హీరో సేతు తెలిపారు. వాలిభరాజా చిత్రంలో తమకున్న స్నేహం కారణంగా సంతానం ముఖ్య పాత్రలో నటించారని, ఆ చిత్రానికి ఆయన నటించడం చాలా ప్లస్ అయిందని చెప్పారు. కాగా ఇందులోనూ సంతానం నటించాల్సిందని, అయితే ఆయన హీరోగా చాలా బిజీగా ఉనందువల్ల నటించలేకపోయినట్లు వివరించారు. ఆళుక్కు పాది 50-50 చిత్రం వైవిధ్యంతో కూడిన ప్రేమ కథా చిత్రం అని సేతు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement