బీసీలకు ప్రత్యేక పార్టీ అవసరం: కృష్ణయ్య

23 Apr, 2018 02:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనాభాలో సగభాగం ఉన్న వెనుకబడిన తరగతులకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసింది. బీసీలకు ప్రత్యేకంగా రాజకీయ పార్టీ అవసరమని అభిప్రాయపడింది. ప్రత్యేక పార్టీలో బీసీలే ప్రతినిధులుగా ఉంటారని సూచించింది. దీనిపై లోతైన చర్చ జరగాల్సి ఉందని, త్వరలో ఎజెండా ప్రకటించనున్నట్లు రాజకీయ తీర్మానం చేసింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఆదివారం సెంట్రల్‌ కోర్ట్‌లో జరిగింది.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య ముఖ్య అథితిగా హాజరై ప్రసంగించారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని రాజ్యాంగం చెబుతున్నా.. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ర్యాగ అరుణ్, వినయ్‌ శివశంకర్, సూర్యప్రకాశ్, ప్రభంజన్, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు