బీసీల రాజ్యాధికారమే ప్రధాన ఎజెండా!

10 Sep, 2023 02:14 IST|Sakshi

రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నెల 10న బీసీల సింహగర్జన

ప్రతి ఇంటికో మనిషి... ఊరికో బండి చొప్పున సభకు తరలివస్తారు

మా నినాదం ‘కులానికో అసెంబ్లీ సీటు... బీసీలకే ఓటు’

‘సాక్షి’తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అటు చట్టసభల్లో... ఇటు మంత్రి పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేదు. 5 నుంచి 10 శాతం ఉన్న అగ్రకులాలకు చెందిన వారు 50 శాతం పైబడి పదవులు దక్కించుకుంటున్నారు. రా జ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన కేటాయిం పులు జరగాలి. కానీ ప్రతి పార్టీ బీసీలకు అత్తెసరు స్థానాలిచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఓట్లు రాబట్టేందుకు సంక్షేమ ఫలాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ బీసీలు బాగు పడాలంటే సంక్షేమ పథకాలతో సాధ్యం కాదు.

కేవలం రాజకీ య పదవులు, పాలనలో కీలక బాధ్యతలు దక్కితే నే చట్టాలు చేసే అధికారం వస్తుంది. ఆ ఆలోచన తోనే ఈసారి ఎన్నికల్లో బీసీలకు అత్యధిక టికెట్లు రాబట్టేందుకు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీల సింహగర్జన సభను నిర్వహిస్తున్నాం’’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన సరూర్‌నగర్‌ స్టేడియంలో లక్షలాది మందితో నిర్వహిస్తున్న బీసీల సింహగర్జన బహిరంగ సభ నేపథ్యంలో ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచు కున్నారు. అవి ఆయన మాటల్లోనే...

ప్రతి పార్టీ 60 సీట్లు ఇవ్వాలి.. కానీ
రాష్ట్ర జనాభాలో 60 శాతానికిపైగా ఉన్న బీసీలకు ప్రతి రాజకీయ పార్టీ కనీసం 60 సీట్లు కేటాయించాలి. అన్ని ప్రధాన కులాలను కలుపుకుంటూ టికెట్లు ఇవ్వాలి.  ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థి తులతో పోలిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ లకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. 2018 ఎన్ని కల్లో బీఆర్‌ఎస్‌  బీసీలకు 26 సీట్లు కేటాయించ గా... తాజాగా ప్రకటించిన జాబితాలో కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చింది.

అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు ఈ దఫా సీటు కేటాయించకపోవ డం గమనార్హం. ఇక కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు ఏమేరకు సీట్లు కేటాయిస్తాయో వేచిచూడాలి. మా నినాదం మాత్రం ఒక్కటే. ‘కులానికో సీటు, అలాంటి పార్టీలకే బీసీల ఓటు’. సంక్షేమ పథకాల అమలంటూ బీసీలకు భిక్ష వేసినట్లు చేస్తూ ఓట్లు రాబట్టుకుంటున్నాయి. నిధుల కేటాయింపు అనేది బీసీల హక్కు. 

ప్రతి పార్టీ బీసీ రాజకీయ పాలసీ ప్రకటించాలి
త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నా యి. వెనువెంటనే పార్లమెంటు ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీ రాజకీయ పాలసీని ప్రకటించాలి. ఈమేరకు బీసీల సింహగర్జన సభలో తీర్మానాలు చేస్తాం. ప్రతి ఇంటి నుంచి ఓ మనిషి... ప్రతి ఊరి నుంచి ఓ బండి... నినాదంతో సింహగర్జన నిర్వ హిస్తున్నాం.

రాజకీయ పార్టీలకతీతంగా ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నా.  దళిత, గిరిజన సంఘాల ప్రతినిధులు సైతం ఈ సభకు రాను న్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పలు సంఘాల ప్రతినిధులు రానున్నారు. ఈ బహిరంగ సభకు దివంగత గద్దర్‌ పేరు పెడుతున్నాం.

మరిన్ని వార్తలు